Trivikram Srinivas: గురూజీని.. అలా ట్రోల్ చేస్తున్నారేంటి?

ABN , First Publish Date - 2023-02-25T00:39:25+05:30 IST

మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పేరు రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. దీనికి కారణం ఓ కారు

Trivikram Srinivas: గురూజీని.. అలా ట్రోల్ చేస్తున్నారేంటి?
Pooja Hegde and Trivikram Srinivas

మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పేరు రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. దీనికి కారణం ఓ కారు (Car) కావడం విశేషం. ప్రస్తుతం తను చేస్తున్న SSMB28 చిత్రం కోసం ఆయన ఓ కారు కొన్నారనేలా వార్తలు వినవస్తున్నాయి. అయితే ఆ కారు.. సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న పూజా హెగ్డే కోసం కొన్నారని, అది త్రివిక్రమ్ పర్సనల్‌గా కొన్నారనేలా కొందరు వార్తలు వైరల్ చేస్తున్నారు. అయితే కారు కొన్నారా? లేదా? అనే విషయం పక్కన పెడితే.. ఇప్పుడు ఇదే కారు విషయంలో సరికొత్తగా మరో వార్త వైరల్ అవుతోంది.

దర్శకుడు కె. విశ్వనాధ్‌ (K Viswanath)కి ‘ఎస్’ సెంటిమెంట్ ఎలాగో.. త్రివిక్రమ్‌కి కూడా ‘అ, ఆ’ల సెంటిమెంట్ ఉందనే విషయం తెలిసిందే. అంతేకాకుండా.. త్రివిక్రమ్‌ (Trivikram)కు ఉన్న మరో సెంటిమెంట్.. హీరోయిన్లు. తను చేసే సినిమాలకు సంబంధించి వరుసగా రెండు, మూడు సినిమాలలో ఒకే హీరోయిన్ ‌(Heroine)ని ఆయన కంటిన్యూ చేస్తుంటారు. అలా ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu)తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలో మళ్లీ పూజా హెగ్డే (Pooja Hegde)నే హీరోయిన్‌గా సెలక్ట్ అయింది. త్రివిక్రమ్ తర్వాత చేయబోయే సినిమాలో కూడా దాదాపు పూజా హెగ్డేనే హీరోయిన్ అనేలా టాక్ నడుస్తోంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసే సినిమాలకు సంబంధించి హారికా అండ్ హాసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations) లేదంటే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుంది. ఈ రెండు బ్యానర్లలో త్రివిక్రమ్‌కి కూడా పార్టనర్‌షిప్ ఉందనేలా టాక్ ఉంది. ఈ నేపథ్యంలో.. ప్రొడక్షన్ తరపున రూ. 2 కోట్లు పెట్టి కేవలం హీరోయిన్ కోసం ఒక లగ్జరీ కారుని కొనుగోలు చేశారట.

అంటే.. ఈ ప్రొడక్షన్స్‌లో చేసే సినిమాలకు సంబంధించి హీరోయిన్లను సెట్స్‌కి తీసుకురావడానికి, మళ్లీ తీసుకెళ్లి హోటల్స్‌లో దింపడానికి.. అద్దె కార్లు అయితే భారీగా ఖర్చు అవుతుందని.. ఏకంగా ఒక కారునే కొనేశారనేది తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. దీనిని కొందరు.. పూజా హెగ్డేకు త్రివిక్రమ్ రెండు కోట్ల విలువ చేసే కారుని గిఫ్ట్‌గా ఇచ్చాడనేలా పుట్టించేశారు. అయితే ఇది పూజా హెగ్డే కోసం కొన్న కారు అయితే కాదని.. ఈ బ్యానర్స్‌లో ఇక ఏ హీరోయిన్ చేసినా.. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు.. వారి కోసం ఈ కారు ఉంటుందనేది ప్రస్తుతానికి నడుస్తున్న వార్తలోని సారాంశం. మరి ఈ విషయంపై పైన చెప్పుకున్న రెండు బ్యానర్ల నిర్మాతలుగానీ, లేదంటే దర్శకుడు త్రివిక్రమ్‌గానీ (Director Trivikram) స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

*********************************

Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

Nagineedu: నాకస్సలు భయం లేదు.. నేనే రాజు, నేనే మంత్రి (OHRK Promo)


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

GlobalStar Ram Charan: రామ్ చరణ్ రేంజ్ మారిపోయిందబ్బా..

Updated Date - 2023-02-25T09:16:16+05:30 IST