Actor Brahmaji: మెగా ఫ్యామిలీపై కామెంట్స్.. రోజాకి బ్రహ్మాజీ అదిరిపోయే పంచ్

ABN , First Publish Date - 2023-01-19T19:34:44+05:30 IST

ఏపీ మంత్రి రోజా (Roja)కి నటుడు బ్రహ్మాజీ (Brahmaji) అదిరిపోయే పంచ్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ (Mega Family)‌లో ఆరేడు మంది హీరోలు ఉన్నారు. అందుకే చిన్న ఆర్టిస్ట్‌లు భయపడి వారికి...

Actor Brahmaji: మెగా ఫ్యామిలీపై కామెంట్స్.. రోజాకి బ్రహ్మాజీ అదిరిపోయే పంచ్
Brahmaji Reaction on Roja Comments

ఏపీ మంత్రి రోజా (Roja)కి నటుడు బ్రహ్మాజీ (Brahmaji) అదిరిపోయే పంచ్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ (Mega Family)‌లో ఆరేడు మంది హీరోలు ఉన్నారు. అందుకే చిన్న ఆర్టిస్ట్‌లు భయపడి వారికి సపోర్ట్ చేస్తున్నారంటూ రోజా చేసిన కామెంట్స్‌పై.. ట్విట్టర్ వేదికగా బ్రహ్మాజీ రియాక్ట్ అయ్యారు. మెగా ఫ్యామిలీపై గత కొన్ని రోజులుగా రోజా ఏదో ఒక సందర్భంలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఆమె కామెంట్స్‌పై చిరంజీవి (Chiranjeevi) కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వారు ఫేమస్ అవ్వాలంటే.. ఆమె మాటలని ఎవరైనా పట్టించుకోవాలంటే.. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడాలి. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తేనే ఎవరైనా వారిని పట్టించుకుంటారు. నేను మాత్రం వారిని తిరిగి ఏమీ అనను.. అని చిరంజీవి చెప్పుకొచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి కాకుండా.. ఫస్ట్ టైమ్ ఒక నటుడు రోజా వ్యాఖ్యలపై రెస్పాండ్ అవడంతో.. బ్రహ్మాజీ పేరు ఇప్పుడు వైరల్ అవుతోంది.

రోజా ఏమందంటే..

హైపర్ ఆది (Hyper Aadhi) ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై రోజా మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు. వాళ్లకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే.. సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్‌లు రావు. ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో అని భయంతోనే చిన్న ఆర్టిస్ట్‌లు వాళ్లకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు తప్ప ప్రేమతో మాత్రం కాదు. నిజంగా ప్రేమ ఉంటే.. వాళ్లు ప్రకాశ్ రాజ్‌ (Prakash Raj)కి మా ఎన్నికలలో సపోర్ట్ చేసినప్పుడు.. ఆయన ప్రెసిడెంట్‌గా ఎందుకు గెలవలేదు. ఒక్కసారి ఆలోచించండి.. ప్రేమ వేరు.. భయం వేరు. అలాంటి వాటి కోసం చిన్న చిన్న వాళ్లని తిట్టాలని నేను అనుకోను.. అని రోజా చెప్పుకొచ్చారు.

దీనికి బ్రహ్మాజీ ఏమన్నారంటే..

‘‘నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ campain చెయ్యమని కానీ, పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్ట్ లే కదా.. అంత భయపడతారెందుకు..’’ అని మంత్రి రోజాని ఉద్దేశించి బ్రహ్మాజీ.. తన ట్వీట్‌లో ప్రశ్నించారు. దీనికి నెటిజన్లు.. ‘ఎందుకన్నా ఇలాంటి వాటిపై రెస్పాండ్ అవడం’ అని కొందరంటుంటే.. మెగాభిమానులు మాత్రం ‘అస్సలు ఊహించలేదన్నా.. సినిమా ఇండస్ట్రీ నుండి రియాక్ట్ అయిన ఫస్ట్ పర్సన్ అన్న నువ్వు.. థ్యాంక్యూ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు.. ‘ఇండస్ట్రీలో కూడా మార్పు మొదలైంది’ అంటూ బ్రహ్మాజీ ట్వీట్‌ను రీ ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మాజీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

Brahmaji.jpg

Updated Date - 2023-01-19T22:28:04+05:30 IST