Maheshbabu: ఆ ఇంటికి పది కోట్లా?

ABN , First Publish Date - 2023-02-11T16:44:18+05:30 IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌(maheshbabu) - త్రివిక్రమ్‌ (Trivikram)కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబీ 28’ (SSMB28)ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత.

Maheshbabu: ఆ ఇంటికి పది కోట్లా?

సూపర్‌స్టార్‌ మహేశ్‌(maheshbabu) - త్రివిక్రమ్‌ (Trivikram)కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబీ 28’ *SSMB28)ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత. పూజా హెగ్డే కథానాయిక. ఇటీవల తొలి షెడ్యూల్‌ పూర్తయింది. తదుపరి షెడ్యూల్‌ సన్నాహాలో త్రివిక్రమ్‌ టీమ్‌ సిద్ధమవుతోంది. ప్రస్తుతం మహేశ్‌ 18వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ కోసం విదేశాలకు విహారానికి వెళ్లారు. ఆయన వచ్చిన వెంటనే అంటే ఈ నెల మూడో వారంలో రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఏఎస్‌.ప్రకాష్‌ నేతృత్వంలో ఓ విలాసవంతమైన ఇంటి సెట్‌ను (big set for ssmb28) రెడీ చేస్తున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఇంటి సెట్‌ కోసం రూ.10కోట్లు ఖర్చు చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. (10 Crores for set)

తాజా షెడ్యూల్‌తోపాటు సగం సినిమా ఈ సెట్‌లోనే చిత్రీకరించనున్నారట. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ఘా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2023-02-11T16:44:19+05:30 IST