TS Assembly Polls : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2023-10-09T12:37:22+05:30 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ని విడుదల చేసింది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వివరాలను సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ వెల్లడించారు..

TS Assembly Polls : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే..?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ని విడుదల చేసింది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వివరాలను సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల కోసం ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నాం. వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించాం. ఐదు రాష్ట్రాల అధికారులు, పార్టీల నేతలతో చర్చలు జరిపాం. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో 60 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు పొందారు. అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. మిజోరం, ఛత్తీస్‌గడ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. ఈ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించాం. ఐదు రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందిఅని రాజీవ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.


CEC.jpg

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు..?

నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు

ఒకే విడతలో తెలంగాణలో ఎన్నికల పోలింగ్

డిసెంబర్-03న ఫలితాలు

TS-Electtions.jpg

ఓటర్లు ఇలా..!

తెలంగాణలో జెండర్ రేషియో : 998

ఓటర్ల సంఖ్య : 3.17,17,389 మంది

పోలింగ్ కేంద్రాల సంఖ్య : 35,356

18-19 ఏళ్ల వయస్సు ఓటర్లు : 3,35,043 మంది

కొత్త ఓటర్లు : 17,01,087 మంది

తొలగించిన ఓట్లు : 6,10,694 మంది

Voters.jpg

కాగా.. 2018 డిసెంబర్-07న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత పదవికాలం 2024 జనవరి-16న ముగియనున్నది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

Updated Date - 2023-10-09T13:00:05+05:30 IST