NRI: వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా శత చండీ హోమం

ABN , First Publish Date - 2023-03-25T20:01:08+05:30 IST

వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ (VCMS) ఆధ్వర్యంలో ఘనంగా శత చండీ హోమం

NRI: వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్  ఆధ్వర్యంలో ఘనంగా శత చండీ హోమం

సింగపూర్ చైనాటౌన్‌లో వేంచేసియున్న శ్రీ మారియమ్మన్ ఆలయంలో ఇటీవల జరిగిన మహా కుంభాభిషేక క్రతువును పురస్కరించుకొని జరిగిన మండల పూజలు, శత చండీ హోమం, తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను సింగపూర్‌లోని ఆర్యవైశ్య కుటుంబాలు అత్యంత శ్రద్ధా ప్రపత్తులు, భక్తి పారవశ్యంతో పాల్గొని ఘనంగా నిర్వహించుకున్నారు.

వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల నడుమ గత తొమ్మిది నెలలుగా ప్రతిరోజూ విష్ణు సహస్రనామ పారాయణ, లలితా లక్షార్చన, సామూహిక భజనా కార్యక్రమాలు శ్రీ వాసవి మాత అనుగ్రహంతో మునుపెన్నడూ జరుగని రీతిలో ఆధ్యాత్మిక, ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి.

సింగపూర్‌లోని శ్రీ మారియమ్మన్ ఆలయం సుమారు రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన, శక్తిమంతమైన పురాతన హిందూ దేవాలయం మాత్రమే కాక సింగపూర్ జాతీయ స్మారక చిహ్నాలలో ఒకటి కూడా. ఇంతటి ప్రశస్తమైన దేవాలయానికి గతంలో అయిదు సార్లు మాత్రమే కుంభాభిషేకం జరిగినట్లు చరిత్ర. సుమారు 16 సంవత్సరాల తరువాత అటువంటి మహా కుంభాభిషేక మహోత్సవం కన్నుల పండువగా గత నెల ఫిబ్రవరి 12వ తారీఖున మొదలై గత నలభై రోజులుగా మండల పూజా కార్యక్రమాలతో కొనసాగి శత చండీ హోమంతో సుసంపన్నమైంది.

1.jpg

ఈ మొత్తం 9 నెలల కార్యక్రమ రూపకర్త అయిన క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి మొత్తం కార్యక్రమ సంక్షేమ బాధ్యతలన్నీ క్లబ్ సీనియర్ సభ్యుడైన ముక్కా కిషోర్ కి అప్పగించి వారిచేత ఈ మొత్తం కార్యక్రమాన్ని నడిపించారు.

అరుదుగా వచ్చే ఇటువంటి మహత్తర అవకాశాన్ని వాసవి క్లబ్ సింగపూర్ ఆధ్వర్యంలో ఇక్కడి ఆర్యవైశ్య కుటుంబాలు అందిపుచ్చుకొని, తమ విరాళాలను గుడికి అందచేయటమే కాక, గత తొమ్మిది నెలలుగా పైన పేర్కొన్న విధంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకొంటూ, విశిష్టమైన రీతిలో భక్తి మార్గాన్ని అనుసరించారు.

ఎంతో అరుదైన మహా కుంభాభిషేకం వంటి సదవకాశం, వాసవి క్లబ్ దశమ వార్షికోత్సవ సమయంలో తటస్థించటం కేవలం కాకతాళీయం మాత్రమే కాదు, ఇచ్చటి ఆర్యవైశ్యులపై శ్రీ వాసవి అమ్మ వారి కృపకు నిదర్శనం అని క్లబ్ వ్యవస్థాపక గౌరవాధ్యక్షులైన వెంకట్ నాగరాజ్ కైలా మరియు క్లబ్ గౌరవ సెక్రటరీ అయిన మంచికంటి శ్రీధర్ అన్నారు.

నిరంతరాయంగా తొమ్మిది నెలలపాటు సింగపూర్ వంటి దూర తీరాలలో మన హైందవ సంస్కృతిని యువతరానికి, పిల్లలకు పరిచయం చేస్తూ, ఇంతటి భక్తి ప్రధాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోగలగటం ఇక్కడి ఆర్యవైశ్యుల సంఘీభావానికి నిదర్శనమని క్లబ్ అధ్యక్షులైన అరుణ్ కుమార్ గట్లూరు మరియు క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి సంక్షిప్త సమాచారంలో సభ్యులనుద్దేశించి పంపడం జరిగింది.

4.jpg

వాసవి క్లబ్‌లో సీనియర్ సభ్యులైన మురళి కృష్ణ పబ్బతి, రాజశేఖర్ గుప్త, మకేష్ భూపతి, నూతన సభ్యులైన సుమన్ రాయల, ఆనంద్ గందె, వినయ్, కిషోర్ శెట్టి, సరిత, ఫణీష్ & వాసవి మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాద భలం లేకపోతే ఇంతటి కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరిని సమన్వయము చేసుకొంటూ వెళ్లడం అసాధ్యమని ముక్తకంఠంతో చెప్పడం విశేషం.

ఈ బృహత్తర కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేందుకు వాసవి క్లబ్ మెర్లయన్ కార్యనిర్వాహక విజయ్ సారధి పాడి, శ్రీకాంత్ నూతిగట్టు, సరితా దేవి, దివ్య గాజులపల్లి, భార్గవి, హేమ కిషోర్, రాజశేఖర్ గుప్త, శ్రీవాణి, చైతన్య పురుషోత్తం, వాసవి ఫణీష్, హేమ కిషోర్ ల తమ విశేష సహకారాన్ని అందించారు.

3.jpg

Updated Date - 2023-03-25T20:03:00+05:30 IST