NRI: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా దుబాయిలో తెలుగుదేశం అభిమానుల ప్రదర్శన

ABN , First Publish Date - 2023-10-01T19:01:57+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ దుబాయ్‌లోని ఎన్నారైలు ప్రదర్శన నిర్వహించారు.

NRI: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా దుబాయిలో తెలుగుదేశం అభిమానుల ప్రదర్శన

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో పాటూ గల్ఫ్ దేశాలలోని ప్రవాసాంధ్రులు కూడా నిరసనలలో పాల్గొంటున్నారు.

ఈ మేరకు దుబాయిలోని తెలుగుదేశం పార్టీ అభిమానులు వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేసారు. నల్ల దుస్తులు ధరించి సముద్ర తీరంలోని నౌకలో చంద్రబాబు నాయుడు ఫోటోలు, ప్లకార్డులు పట్టుకుని బాబు అరెస్టును నిరసిస్తూ ఆయనకు సంఘీభావం ప్రకటించారు.

పొదిపిరెడ్డి వాసు, శేఖ్ ఖాదర్ బాషా, రవిచంద్ర, పొట్రురాజు, తుంగ ప్రసాద్, రాధాకృష్ణ మోరంపొడి తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

2.jpg

Updated Date - 2023-10-01T19:04:53+05:30 IST