NRI: స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు

ABN , First Publish Date - 2023-03-20T17:35:20+05:30 IST

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ 2023 మార్చ్ 18న (శనివారం) శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను రామకృష్ణా మిషన్ శారదాహాల్‌లో ఘనంగా నిర్వహించారు.

NRI: స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ (Music academy) 2023 మార్చ్ 18న (శనివారం) శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను రామకృష్ణా మిషన్ శారదాహాల్‌లో ఘనంగా నిర్వహించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపకురాలు యడవల్లి శేషుకుమారి మొట్టమొదటిసారిగా అందరూ తెలుగువారిచే త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరపాలని దృఢసంకల్పంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని అందరి ముందుకు తీసుకురావటం కొనియాడదగ్గ విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యడవల్లి శేషుకుమారి గారి సంగీత గురువు గౌరీ గోకుల్,  రామకృష్ణా మిషన్ స్వామీజీ గౌరవ అతిథిగా హాజరు కావటం విశేషం.

2.jpg

ఈ కార్యక్రమానికి  "TAS (మనం తెలుగు ) అసోసియేషన్", "శ్రీ సాంస్కృతిక కళా సారథి సింగపూర్", ఎస్‌టీఎస్ ఎక్స్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరు కావటం విశేషం. ఈ శుభసందర్భంలో స్వరలయ ఆర్ట్స్ సంస్థకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఇండియాకు ఎఫిలియేషన్ లభించడం సద్గురు త్యాగరాజస్వామి కృపగా భావించి తమ గురువుల సమక్షంలో యూనివర్సిటీ పత్రమును ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యడవల్లి శేషు కుమారి, సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, కిరీటి దేశిరాజు, యడవల్లి శ్రీ విద్య, యడవల్లి శ్రీరామచంద్రమూర్తి, శరజ అన్నదానం, రాధికా నడదూర్, రమ.. వీరందరూ త్యాగరాజ పంచరత్న కీర్తనలను ఆలపించగా.. పలువురు చిన్నారులు, యడవల్లి శేషుకుమారి శిష్యులు "త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలను" ఆలపించారు. ఆదిత్య సత్యనారాయణ వయోలిన్ పై, శివ కుమార్, కార్తీక్ మృదంగంపై వాయిద్య సహకారం అందించారు.

3.jpg

ఈ కార్యక్రమానికి రోజా రమణి ఓరుగంటి, సౌజన్యలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇంత గొప్పగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాదాపుగా 200మంది హాజరు కావటమే కాకుండా.. సాంఘిక మాధ్యమాలాద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం. మొత్తం మీద స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ మొట్టమొదటి సారి తెలుగుతో నిర్వహించిన శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవములకు విశేషస్పందన లభించింది.

4.jpg

5.jpg

Updated Date - 2023-03-20T17:35:20+05:30 IST