Share News

NRI: ఫిలడెల్ఫియాలో సైబర్ టవర్స్ సృష్టికర్త చంద్రబాబుకు కృతజ్ఞత కార్యక్రమం!

ABN , First Publish Date - 2023-10-30T18:53:28+05:30 IST

ఫిలడెల్ఫియాలో మ‌రోసారి ప్రవాస తెలుగువారు, ఐటీ ఉద్యోగులు, ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు అమెరికా ప్రజాస్వామ్య పోరాటానికి జన్మస్థలమైన వ్యాలీ ఫోర్జ్‌ స్మారకచిహ్నం కలిగిన వాలీ ఫోర్జ్ నేషనల్ పార్క్‌లో ఆదివారం సాయంత్రం తమ అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలిపారు.

NRI: ఫిలడెల్ఫియాలో సైబర్ టవర్స్ సృష్టికర్త చంద్రబాబుకు కృతజ్ఞత కార్యక్రమం!

ఫిలడెల్ఫియాలో మ‌రోసారి ప్రవాస తెలుగువారు, ఐటీ ఉద్యోగులు, ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు అమెరికా ప్రజాస్వామ్య పోరాటానికి జన్మస్థలమైన వ్యాలీ ఫోర్జ్‌ స్మారకచిహ్నం కలిగిన వాలీ ఫోర్జ్ నేషనల్ పార్క్‌లో ఆదివారం సాయంత్రం తమ అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలిపారు. అత్యంత కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం కోసం వ్యాలీ ఫోర్జ్‌ పార్క్ నుండి అమెరికా ప్రజాస్వామ్య సైనికులు సాధించిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పోరాటానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేసారు.

తెలుగు రాష్ట్రాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి అవగాహన తీసుకు రావటంలో సైబర్ టవర్స్ పాత్ర చాలా విలువైనదనీ, అటువంటి సైబర్ టవర్స్‌తో మొదలుపెట్టి సైబరాబాద్ నేడు అమెరికాలోని నగరాలతో పోటీ పడుతోందంటే దాని వెనుక దార్శనికుడు టీడీపీ అధినేత చంద్రబాబు కృషి ఎంతో ఉందని పలువురు ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు.

1.jpg

ఇవాళ అమెరికా నలుమూలలా తెలుగు వారు వివిధ రంగాలలో ఉన్నత స్థాయికి చేరటానికి చంద్రబాబు, ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు ప్రధాన కారణమని పలువురు కొనియాడారు.

చంద్రబాబు త్వరగా అక్రమ కేసుల నుండి విముక్తి పొంది, కడిగిన ముత్యంలాగా బయటికి రావాలని ప్లకార్డులు ప్రదర్శించగా, జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకొని “నిజం గెలవాలి”, “వీ అర్ విత్ సిబిఎన్” నినాదాలతో సభాస్థలి మారుమ్రోగింది.

ఈ కార్యక్రమంలో పెన్సిల్వేనియా, డెలావేర్ రాష్ట్రాలకు చెందిన ప్రవాస తెలుగు వారు జోరువానను, చలిని లెక్కచేయక పాల్గొన్నారు.

3.jpg

Updated Date - 2023-10-30T18:54:07+05:30 IST