NRI: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించిన NRI TDP, Janasena..మిన్నెసొటాలో కొనసాగుతున్న నిరసనలు

ABN , First Publish Date - 2023-10-02T15:06:15+05:30 IST

చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ, జనసేన ఎన్నారై శాఖల ఆధ్వర్యంలో మిన్నెసొటాలోని మినియాపొలిస్ నగరంలో నిరసనలు కొనసాగుతున్నాయి.

NRI: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించిన NRI TDP, Janasena..మిన్నెసొటాలో కొనసాగుతున్న నిరసనలు

ఎన్నారై డెస్క్: మాజీ ముఖమంత్రి, తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు అక్రమ అరెస్టు, ఆయనపై అప్రజాస్వామిక దాడికి నిరసనగా ప్రవాస తెలుగు వారు గతంలో మిన్నియాపోలిస్ మిన్నెసోటా నగరంలో పలుసార్లు పలుచోట్ల సమావేశమై సంగీభావం తెలపడం తెలిపారు.

ప్రజాస్వామ్య విలువలను పక్కనపెట్టి , రాజకీయ వ్యవస్థలో ముఖ్యమైన విపక్షాలను మట్టుపెట్టే దిశగా ఆంధ్ర పాలకుల వ్యవహారశైలిని ఖండిస్తూ, నాలుగున్నర దశాబ్దాల మచ్చలేని రాజకీయ నాయకుడు, నిజాయితీ, సుపరిపాలనకు మారు పేరైన నారా చంద్రబాబునాయుడుపై జరుగుతున్న అప్రజాస్వామిక దాడికి నిరసనగా, పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు, పెద్దలు కలిసి టీడీపీ అధినేతకు సంఘీభావం తెలిపారు.

ఈ సమావేశాలు NRI TDP కమిటి సభ్యులు, NRI జనసేన వారితో పాటు పలు కమ్యూనిటీ లీడర్ల ఆద్వర్యంలో We Are With CBN, SAVE DEMOCRACY అనే నినాదాలతో సమైక్యంగా చంద్ర బాబుకు సంఘీభావం ప్రకటించాయి.

అలాగే ఈరోజు జరిగిన “మోత మొగిద్దాం” అనే కార్యక్రమం మేరకు మిన్నియాపోలిస్‌లో అద్భుత నిరసన ప్రదర్శించారు .

3.jpg2.jpg4.jpg

Updated Date - 2023-10-02T15:12:59+05:30 IST