NRI: తానా ఎన్నికల్లో గోగినేని మద్దతు నరేన్ కోడాలికే
ABN , Publish Date - Dec 15 , 2023 | 08:24 PM
తానా ఎన్నికల్లో గోగినేని మద్దతు నరేన్ కోడాలికే

ఎన్నారై డెస్క్: ప్రస్తుతం జరుగుతున్న తానా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న సీనియర్ నాయకుడు శ్రీనివాస గోగినేని పోటీ నుంచి తప్పుకుంటూ డాక్టర్ నరేన్ కోడాలికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.గత వారాంతంలో మిచిగాన్‌లోని తన స్వగృహంలో కలిసిన నరేన్ కొడాలితో తానా ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తుపై విపులంగా చర్చించారు. గోగినేని కృషి చేయాలని ఆశిస్తున్న అనేక విషయాలపై నరేన్ కూడా అంగీకరిస్తూ వాటిని సాకారం చేయటానికి కలిసి పనిచేయటానికి సంసిద్ధు లైయ్యారు.
తానా సమగ్రతకై ప్రస్తుత వర్గ పోరాటాల్లో ఎవరో ఒకరి పూర్తి ఆధిపత్యం తాత్కాలికంగానైనా అత్యవసరమని భావించడం, కొన్ని ముఖ్య కార్యక్రమాల కోసం సుమారు 250,000 డాలర్స్ నరేన్ స్వంతంగా సమకూర్చుతూ మరో 500,000 డాలర్స్ సమీకరణకు వ్యక్తిగత హామీ ఇవ్వడం తన నిర్ణయానికి ముఖ్య కారణమంటున్నారు. తానా సభ్యులందరూ కూడా ఆయనకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతున్నానని కూడా తెలిపారు. ఆ విషయంలో తనకు చేతనైనంతవరకు నరేన్ విజయానికి కృషి చేస్తానని కూడా గోగినేని తెలిపారు.
కాగా శ్రీనివాస గోగినేని, నరేన్ కొడాలి తానాలో అనేక సంవత్సరాలు కలిసి పనిచేసారు. ముఖ్యంగా నరేన్ బోర్డు చైర్మన్‌గా ఉన్నప్పుడు, ఇంకా గోగినేని ఫౌండేషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు తానా బోర్డులో చురుకుగా కలసి పనిచేస్తూ పలువురి మన్ననలు అందుకున్నారు. అలాగే రెండు సార్లు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసినప్పటికీ ఒక్క పరుషపదజాలము కూడా ఒకరిపై ఒకరు వాడుకోకపోవడము గుర్తించాల్సిన విషయము.