NRI: కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు నౌకాయాన సర్వీసు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు

ABN , First Publish Date - 2023-06-01T20:26:58+05:30 IST

ప్రవాసీయులకు విమాన ఛార్జీల భారం తగ్గించేందుకు కేరళ ప్రభుత్వం గల్ఫ్‌కు నేరుగా నౌకాయాన సర్వీసును ప్రారంభించే యోచనలో ఉంది. ఇందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఇటీవల జరిగిన ఓ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది.

NRI: కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు నౌకాయాన సర్వీసు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు

ఎన్నారై డెస్క్: విమాన ప్రయాణ ఛార్జీలు భరించడం మామూలు విషయం కాదు. ఇక పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు తరలి వెళ్లే కార్మికుల పరిస్థితి వర్ణనాతీతం. విమాన ఛార్జీల భారం మోయలేక వారు నానా అవస్థలు పడుతున్నారు. వీరి వెతలను అర్థం చేసుకున్న కేరళ ప్రభుత్వం ఓ కొత్త కార్యాచరణ దిశగా అడుగులు వేస్తోంది. కేరళ తీరం నుంచి గల్ఫ్‌కు నేరుగా ఓ నౌకాయన సర్వీసు ప్రారంభించే యోచనలో ఉంది. ఈ దిశగా ప్రభుత్వం బుధవారం ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సర్వీసును ఏర్పాటు చేసేందుకు ఓ ప్రణాళిక సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర ఓడరేవుల శాఖ మంత్రి అహ్మద్ దేవరకొవిల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఎయిర్‌లైన్స్ సంస్థల ధరలు కేరళీయుల నడ్డి విరుస్తున్నాయని వ్యాఖ్యానించారు. చిరు జీతాలతో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న అనేక మంది తమ సంపాదనలో అధిక భాగం ప్రయాణాల కోసమే కేటాయించాల్సి వస్తోందని వాపోయారు. ఈ ప్రకటనతో కేరళ ఎన్నారైల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

Updated Date - 2023-06-02T05:59:18+05:30 IST