NRI: బ్రిటన్‌లో భారతీయ విద్యార్థి అదృశ్యం..!
ABN , Publish Date - Dec 17 , 2023 | 04:46 PM
లండన్‌లో చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు.
ఎన్నారై డెస్క్: లండన్‌లో చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. లాఫ్‌బరో యూనివర్సిటీలో చదువుకుంటున్న జీఎస్ భాటియా అనే విద్యార్థి డిసెంబర్ 15 నుంచి కనబడట్లేదంటూ ప్రముఖ బీజేపీ నేత మన్‌జిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ఆయన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. చివరిసారిగా అతడు కానరీ వార్ఫ్ ప్రాంతంలో కనిపించాడని తెలిపారు. జీఎస్ భాటియా ఐడీ కార్డు, రెసిడెన్స్ పర్మిట్‌ను కూడా ఆయన షేర్ చేశారు. విద్యార్థి ఆచూకీ తెలిసిన వాళ్లు సమాచారం ఇచ్చేందుకు వీలుగా రెండు ఫోన్ నెంబర్లను కూడా పోస్ట్ చేశారు.