NRI: కెనడాలో మహిళను పొడిచి చంపిన భారత సంతతి వ్యక్తి

ABN , First Publish Date - 2023-05-21T20:25:24+05:30 IST

కెనడాలో బ్రాంప్టన్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భారత సంతతికి చెందిన నవ్ నిషాన్ సింగ్ ఓ మహిళను శుక్రవారం దారుణంగా పొడిచి చంపేశాడు.

NRI: కెనడాలో మహిళను పొడిచి చంపిన భారత సంతతి వ్యక్తి

ఎన్నారై డెస్క్: కెనడాలో బ్రాంప్టన్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భారత సంతతికి చెందిన నవ్ నిషాన్ సింగ్ ఓ మహిళను శుక్రవారం దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ దాడికి సంబంధించి సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా ఓ యువతి స్థితి అచేతనస్థితిలో రక్తపుమడుగులో కనిపించింది. ఆమెను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో మహిళ ఘటనా స్థలంలోనే మరణించింది. కాగా. నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే నిందితుడు నవ్ నిషాన్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, మృతురాలు, నిందితుడు పరిచయస్తులేనని కానిస్టేబుల్ టైలర్ బెల్ మీడియాకు తెలిపారు. అయితే, వారి సంబంధం ఎలాంటిదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన పరిసరాల్లోని వారిని ప్రశ్నిస్తున్నారు. ఘటన తాలూకు సీసీటీవీ ఫుటేజీ కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా, పోలీసులు సింగ్‌ను సోమవారం కోర్టులో హాజరుపరిచారు. బ్రాంప్టన్‌ జనభా దాదాపు ఏడు లక్షలు. అక్కడ పంజాబీ సంతతి వారి సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది.

Updated Date - 2023-05-21T20:25:27+05:30 IST