NRI: హిందువులకు భద్రత కల్పించాలంటూ కెనడా మంత్రికి ‘హిందూ ఫోరమ్ ఫర్ కెనడా’ లేఖ

ABN , First Publish Date - 2023-09-21T23:06:32+05:30 IST

కెనడాలోని హిందువులపై ఖలిస్థానీవాదుల బెదిరింపులకు దిగుతున్నారంటూ ఓటారియోలోని ఎన్‌జీఓ సంస్థ ‘హిందూ ఫోరమ్ కెనడా’ అక్కడి ప్రజాభద్రతా వ్యవహారాల మంత్రి డామినిక్ లిబ్లాంక్‌కు లేఖ రాసింది.

NRI: హిందువులకు భద్రత కల్పించాలంటూ కెనడా మంత్రికి ‘హిందూ ఫోరమ్ ఫర్ కెనడా’ లేఖ

ఎన్నారై డెస్క్: కెనడాలోని హిందువులపై ఖలిస్థానీవాదులు బెదిరింపులకు దిగుతున్నారంటూ ఓటారియోలోని ఎన్‌జీఓ సంస్థ ‘హిందూ ఫోరమ్ కెనడా’(Hindu Forum Canada) అక్కడి ప్రజాభద్రతా వ్యవహారాల మంత్రి డామినిక్ లిబ్లాంక్‌కు తాజాగా లేఖ రాసింది. హిందువులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. కెనడాలోని హిందూ సమాజంలో నెలకొన్న ఆందోళనపై తక్షణం దృష్టి సారించాలని డిమాండ్ చేసింది. ఇది కెనడా పౌరుల భద్రతకు సంబంధించిన అంశమని కూడా అభివర్ణించింది. సోషల్ మీడియాలో హిందూ వ్యతిరేకతతో కూడిన వీడియోలు ఇటీవల కాలంలో వైరల్ కావడం తమ ఆందోళనను మరింత పెంచిందని హిందూ ఫోరమ్ ఫర్ కెనడా తన లేఖలో పేర్కొంది.


ఉగ్రవాదుల జాబితాలో భారత్ చేర్చిన గురుపత్వంత్ పన్నమ్ కెనడాలోని హిందువులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఇటీవల విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. హిందూ కెనేడియన్లు దేశం వీడాలని కూడా హెచ్చరించాడు.

పరస్పర ఉపయోగాలే లక్ష్యంగా దీర్ఘకాలిక వ్యూహాలతో అంతర్జాతీయ సంబంధాలు బలోపేతమవుతాయని హిందూ ఫోరమ్ కెనడా పేర్కొంది. దేశీయ పరిస్థితులు వీటిని ప్రభావితం చేయకూడదని కూడా అభిప్రాయపడింది.

Updated Date - 2023-09-21T23:11:18+05:30 IST