NRI: విదేశీ వర్కర్లకు బంపర్ ఆఫర్.. జర్మనీలో 60 వేల జాబ్స్..

ABN , First Publish Date - 2023-03-30T22:13:13+05:30 IST

తీవ్ర కార్మికుల కొరతతో సతమతమవుతున్న జర్మనీ విదేశీ వర్కర్లతో ఈ లోటును భర్తీ చేసుకునేందుకు సిద్ధమైంది.

NRI: విదేశీ వర్కర్లకు బంపర్ ఆఫర్..  జర్మనీలో 60 వేల జాబ్స్..

ఎన్నారై డెస్క్: తీవ్ర కార్మికుల కొరతతో సతమతమవుతున్న జర్మనీ(Germany).. విదేశీ వర్కర్లతో ఈ లోటును భర్తీ చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ దిశగా దేశ వలస విధానంలో(Immigration Policy) కీలక సంస్కరణలకు(Reforms) ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలను బుధవారం విడుదల చేసింది. ‘‘నిపుణులైన ఉద్యోగులు అందుబాటులో ఉండేలా చేయడమే జర్మనీ ప్రభుత్వం ముందున్న పెద్ద లక్ష్యం’’ అని కార్మిక శాఖ మంత్రి హుబర్టెస్ హీల్ పేర్కొన్నారు. ‘‘జర్మనీ వలసల విధానాన్ని సరికొత్త దిశలో మలుపు తిప్పేందుకు కావాల్సిన సంస్కరణల పునాదిని సిద్ధం చేస్తున్నాం’’ అని ఆర్థిక మంత్రి క్రిస్టియన్ లిండర్ ట్వీట్ చేశారు. తమ దేశ ఆర్థిక విజయాలకు తోడ్పాటునందించే వారికి ఆహ్వానం పలుకుతున్నామని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2022లో జర్మనీలో ఉద్యోగ ఖాళీల సంఖ్య 20 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. దేశంలో ఏటా 60 వేల ఉద్యోగాలను ఈయూయేతర దేశాల వారితో భర్తీ చేయాలనేది ప్రభుత్వ తలంపుగా ఉంది. ఇందుకు సంబంధించి వలస విధానంలో కీలక సంస్కరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది.

Updated Date - 2023-03-30T22:14:04+05:30 IST