Abortion Bill Rules: అబార్షన్ చేయాలంటే అత్యాచారం జరిగినట్టు నిరూపించుకోవాల్సిందేనట.. ఫ్లోరిడాలో వివాదాస్పద చట్టం..!

ABN , First Publish Date - 2023-03-10T21:30:40+05:30 IST

ఆరు వారాలు దాటిన గర్భవతులకు అబార్షన్ నిషేధించే బిల్లును ఫ్లోరిడా పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టారు.

Abortion Bill Rules: అబార్షన్ చేయాలంటే అత్యాచారం జరిగినట్టు నిరూపించుకోవాల్సిందేనట.. ఫ్లోరిడాలో వివాదాస్పద చట్టం..!

ఎన్నారై డెస్క్: ఆరు వారాలు దాటిన గర్భవతులకు అబార్షన్(Abortion) నిషేధించే బిల్లును ఫ్లోరిడా(Florida) పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టారు. అత్యాచారం వంటి అత్యవసర సందర్భాలు మినహా తతిమా అన్ని సమయాల్లో ఆరు వారాల తరువాత అబార్షన్‌ చేయకూడదంటూ ఈ బిల్లు రూపొందించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అత్యాచారం జరిగిన సందర్భాల్లోనూ బాధితులు అత్యాచారం జరిగినట్టు ఆధారాలు సమర్పించాలంటూ కొత్త బిల్లులో నిబంధన విధించడం కలకలానికి దారి తీసింది. ఇక 15 వారాల తరువాత ఈ మినహాయింపునూ అనుమతించకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. అయితే.. ఫ్లోరిడా గవర్నర్ కూడా ఈ బిల్లుకు మద్దతుగా నిలుస్తున్నారు. కుటుంబ వ్యవస్థకు, జీవితానికే తన మద్దతని పేర్కొన్నారు.

అబార్షన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పిచ్చాక అనేక రాష్ట్రాల వారు ఫ్లోరిడాలో అబార్షన్ల కోసం క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2022లో అబార్షన్ల సంఖ్య 38 శాతం మేర పెరిగింది. ఈ నేపథ్యంలో అబార్షన్లు అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం నడుం కట్టింది. అయితే.. అబార్షన్లను నిషేధం.. మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-03-12T21:17:02+05:30 IST