Share News

NRI: రోడ్డు పక్కన విదేశీ మహిళ మృతదేహం.. పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశిలిస్తే..

ABN , First Publish Date - 2023-10-21T15:46:26+05:30 IST

విదేశీ గర్ల్‌ఫ్రెండ్‌పై అనుమానం పెంచుకున్న ఓ భారతీయుడు చివరకు దారుణానికి ఒడిగట్టాడు.

NRI: రోడ్డు పక్కన విదేశీ మహిళ మృతదేహం.. పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశిలిస్తే..

ఎన్నారై డెస్క్: విదేశీ గర్ల్‌ఫ్రెండ్‌పై అనుమానం పెంచుకున్న ఓ భారతీయుడు చివరకు దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను భారత్‌కు రప్పించి మరీ అంతమొందించాడు. నాలుగు రోజుల తరువాత మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచీతో చుట్టి ఓ ప్రభుత్వ పాఠశాల సమీపంలో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు. అతడు చేసిన దారుణం సీసీకెమెరా కంటికి చిక్కడంతో పోలిసులకు దొరకిపోయాడు(Man Killed Kept Swiss Womans Body In Car. How He Was Arrested). న్యూఢిల్లీలో(Delhi) ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..

నగరానికి చెందిన గురుప్రీత్ సింగ్‌ స్విట్జర్లాండ్‌లో ఉండగా స్థానిక యువతి లీనా బర్జర్‌తో పరిచయమైంది. ఆ పరిచయం వారి మధ్య స్నేహంగా మారింది. ఇద్దరూ సన్నిహితులయ్యారు. గురుప్రీత్ సింగ్ తరచూ ఆమెను కలుసుకునేందుకు స్విట్జర్లాండ్‌ వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో అతడి మనసులో అనుమానపు బీజాలు నాటుకున్నాయి. గర్ల్‌ఫ్రెండ్ మరోవ్యక్తికి దగ్గరవుతోందని భావించాడు. తన అనుమానాన్ని బయటకు తెలియనీకుండా భారీ కుట్రకు తెరలేపాడు.

NRI: అమెరికా వృద్ధురాలికి కంప్యూటర్‌పై అవగాహన ఉండదని తెలిసే పక్కా ప్లాన్.. బ్యాంక్‌లోని డబ్బంతా విత్‌డ్రా చేయించి..


ఇటీవల ఓ మారు ఆమెను ఇండియాకు రమ్మని గురుప్రీత్‌ ఆహ్వానించడంతో ఆమె మరో ఆలోచన లేకుండా సరే అంది. అతడి మనసులో దుర్మార్గాన్ని అస్సలు గుర్తించలేకపోయింది. అక్టోబర్ 11న ఇండియాకు వచ్చింది. ఆ తరువాత ఐదు రోజులకు అతడు ఆమెను ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె చేతులు, కాళ్లు కట్టేసి హత్య చేశాడు. అప్పటికే అతడు ఆమె గుర్తింపు కార్డుతో ఓ కారును అద్దెకు తెచ్చుకున్నాడు. యువతిని హత్య చేశాక ఆమె మృతదేహాన్ని కారులో పెట్టాడు. కానీ కారులోంచి దుర్వాసన రావడం మొదలయ్యాక అతడు మృతదేహాన్ని తిలక్‌నగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల సమీపంలో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.

Canada Visa: ముదిరిన దౌత్య వివాదం.. భారతీయ విద్యార్థులకు భారీ షాకిచ్చిన కెనడా!

విదేశీ మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. పరిసరాల్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడి జాడ కనుక్కుని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి అద్దె కారుతో సహా రెండు కార్లతో పాటూ రూ.2.25 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2023-10-21T16:07:56+05:30 IST