NRI: గుళ్లో మహిళపై చేయిచేసుకున్న ఎన్నారైపై కేసు

ABN , First Publish Date - 2023-09-18T22:13:28+05:30 IST

గుళ్లో మహిళపై చేయిచేసుకున్న ఉదంతంలో సింగపూర్‌లోని ఓ భారత సంతతి లాయర్‌పై తాజాగా కేసు నమోదైంది.

NRI: గుళ్లో మహిళపై చేయిచేసుకున్న ఎన్నారైపై కేసు

ఎన్నారై డెస్క్: గుళ్లో మహిళపై చేయిచేసుకున్న ఉదంతంలో సింగపూర్‌లోని(Singapore) ఓ భారత సంతతి లాయర్‌పై(Indian Origin Lawyer) తాజాగా కేసు నమోదైంది. బాధితురాలి చెంపపై కొట్టినందుకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు(Case filed). స్థానిక మీడియా ప్రకారం, నిందితుడు రవి మదసామి ఇటీవల సౌత్ బ్రిడ్జి రోడ్‌లోని ఓ గుడిలో మహిళపై చేయి చేసుకున్నాడు(slap woman in temple). అంతకుమునుపు ఆమెను దుర్భాషలాడాడు. ఆమె వ్యక్తిత్వహననం చేసేలా నోరుపారేసుకున్నాడు. దీంతో, పోలీసులు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


రవి మదసామిపై గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. సింగపూర్ న్యాయవ్యవస్థ పరువుతీసేలా నిరాధార ఆరోపణలు చేసినందుకు లాయర్‌గా ప్రాక్టీస్ చేయకుండా ఐదేళ్ల నిషేధానికి గురయ్యారు. అంతకుమునుపు మరో వ్యక్తిని పబ్లిక్‌గా దుర్భాషలాడిన ఉదంతంలోనూ కేసు నమోదైంది.

తాజా కేసు నేపథ్యంలో స్థానిక అధికారులు అతడి మానసిక స్థితిని అంచనా వేసేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 29న అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.

Updated Date - 2023-09-18T22:32:56+05:30 IST