NRI: డల్లాస్‌లో NRI టీడీపీతో గౌతు శిరీష సమావేశం

ABN , First Publish Date - 2023-08-14T20:29:42+05:30 IST

అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని డల్లాస్ నగరంలో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష రాక మేరకు ఈరోజు టీడీపీ కుటుంబ సభ్యుల సమావేశం జరిగింది.

NRI: డల్లాస్‌లో NRI టీడీపీతో గౌతు శిరీష సమావేశం

ఎన్నారై డెస్క్: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని డల్లాస్ నగరంలో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష రాక మేరకు ఈరోజు టీడీపీ కుటుంబ సభ్యుల సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన రెండు తెలుగు రాష్ట్రాల ప్రవాస ఆంధ్రులు అందరూ ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాతృ రాష్ట్రానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అన్నింట ఆదర్శంగా ఉండాలని విదేశాలలో ఉన్న ప్రతి తెలుగు వారు ఆకాంక్షిస్తున్నారని, మళ్లీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పాలన రావాలని, ముఖ్యంగా అమరావతి రాజధాని ఏర్పాటు అవ్వాలని కార్యక్రమం నిర్వాహకుడు చింతమనేని సుధీర్ ప్రసంగించారు.

2.jpg


గౌతు శిరీష మాట్లాడుతూ రాష్ట్రం నాలుగున్నర సంవత్సరాలుగా అన్ని రంగాల్లో సమూలంగా నాశనం అయ్యిందని, ప్రతిరోజూ తెలుగుదేశం పార్టీ అవసరాన్ని చంద్రబాబునాయుడు నాయకత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రం ఏం కోల్పోయిందో రేపు భవిష్యత్ తరాలకి ఎంత అన్యాయం జరుగుతుందో తెలుగు ప్రజలకు అర్థం అవుతోందని, ముఖ్యంగా రాయలసీమలో ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర రోజురోజుకీ అంచనాలకు మించి ప్రాధాన్యత సంతరించుకుంటోందని తెలిపారు. పల్లెలు పట్టణాలని ఉత్తేజిత పరుస్తూ మహిళలకు సోదరుడిగా, అవ్వ తాతలకు మనవడిగా, ప్రతి ఒక్కరికీ తమ కుటుంబ సభ్యుడిగా అభిమానంతో లోకేశ్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ వెనుకడుగు వేయకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి అధికార పార్టీ నాయకుల ఆగడాలను, రాష్ట్రానికి, ప్రజలకి వారు చేస్తున్న అన్యాయాన్ని సాక్ష్యాలతో సహా ప్రజల్లో మమేకమై వారికి అర్థమయ్యేలా చేస్తున్న విధానాన్ని గుర్తు చేశారు.

3.jpg


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో అతి ముఖ్యమైన మౌలిక వసతులైన మంచినీటి ప్రాజెక్టులపై జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకి తెలియపరిచేందుకు చేస్తున్న యాత్రలో ఆయనకు సృష్టిస్తున్న ఆటంకాలు, ఇబ్బందులు, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చేతిలో ఉన్న అధికారంతో ప్రతిపక్షాల హక్కులను హరించే రీతిలో సాగుతున్న రాక్షస పాలన, ఆ పాలనలో భాగంగా ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఆయన అనుచరులపై కక్షపూరిత చర్యలతో వందల మంది టీడీపీ కార్యకర్తలపై నాయకులపై పోలీసు శాఖ పెడుతున్న అన్యాయమైన ఆరోపణలు, ముఖ్యంగా 307 అనే సెక్షన్‌ని ఈరోజు చట్టం ప్రతిపక్షాలపై కేసులు పెట్టడ్డాని ప్రస్తావించారు.

Updated Date - 2023-08-14T20:29:45+05:30 IST