Share News

Mad Love: ఇదేం పిచ్చి తల్లోయ్.. ప్రియుడు వేరే అమ్మాయి వైపు చూస్తున్నాడని సూదితో కంట్లో పొడిచేసింది..!

ABN , First Publish Date - 2023-11-28T17:02:16+05:30 IST

బాయ్‌ఫ్రెండ్ వేరే అమ్మాయిలను చూస్తున్నాడని అతడి కంటిని సూదితో పొడిచిన మహిళ. అమెరికాలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Mad Love: ఇదేం పిచ్చి తల్లోయ్.. ప్రియుడు వేరే అమ్మాయి వైపు చూస్తున్నాడని సూదితో కంట్లో పొడిచేసింది..!

ఇంటర్నెట్ డెస్క్: ఎనిమిదేళ్లుగా ఆ జంట ప్రేమలో ఉంది. అయితే, తన బాయ్‌ఫ్రెండ్‌ అప్పుడప్పుడూ వేరే అమ్మాయిల వైపు చూడటం ఆమె తట్టుకోలేకపోయింది. ఇటీవల ఓ రోజు ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. అసూయ, అభద్రతాభావంతో విచక్షణ కోల్పోయిన ఆమె క్షణికావేశంలో అతడి కంటిలో సూది పెట్టి పొడిచేసింది. కుక్కలకు ఇచ్చే రేబీస్ నిరోధక ఇంజెక్షన్‌ సూదితో ఈ దారుణానికి పాల్పడింది. అమెరికాలోని(USA) ఫ్లోరిడాలో(Florida) తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.

Indian Railway: చేతిలో ట్రైన్ టికెట్ ఉన్నా సరే.. ఈ మిస్టేక్ చేస్తే జరిమానా తప్పదు.. చాలా మందికి తెలియని రూల్..!

Viral: చికెన్ శాండ్‌విచ్‌తో ఫ్లైట్ ఎక్కిన మహిళ..విమానంలో కునుకు తీయడంతో జరిగిందో దారుణం!


మియామీకి(Miami) చెందిన శాండ్రా జెమినెజ్ శనివారం తన బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడింది. చూస్తుండగానే వారి మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలో విచక్షణ మరిచిన ఆమె సోఫాలో కూర్చున్న తన బాయ్‌ఫ్రెండ్ మీదకు దూకుంది. రెబీస్ ఇంజెక్షన్ సూదిని అతడి కంట్లో గుచ్చింది(US Woman stabs boyfriend's eye with rabies needle). బాధ తాళలేక అతడు విలవిల్లాడుతుండం చూశాక కానీ ఆమెకు తాను ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో అర్థంకాలేదు. దీంతో బెదిరిపోయిన ఆమె అక్కడి నుంచి ఇంటిబయటకు పరుగులు తీసింది.

Viral: విసిగిపోయిన భారతీయ రెస్టారెంట్.. బ్రిటన్ ప్రజలకు ఊహించని వార్నింగ్!


ఈలోపు మహిళ బాయ్‌ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటివెనకున్న కారులో నిందితురాలు పడుకుని ఉండటాన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందని ప్రశ్నిస్తే.. బాయ్‌ఫ్రెండ్‌ తనని తానే కంట్లో పొడుచుకున్నాడని ఆమె నోటికొచ్చినట్టు చెప్పింది. ఈ క్రమంలో పోలీసులు ఆమెపై అగ్రవేటెడ్ బ్యాటరీ ( ఉద్దేశపూర్వకంగా గాయపరచడం) నేరం కింద కేసు నమోదు చేశారు. ఆమెను బాండ్‌పై విడుదల చేయాలంటే 7,500 డాలర్లు కట్టాలని పోలీసులు తెలిపారు.

Viral: వైద్య పరీక్షలకు వెళ్లిన వృద్ధుడు..ఆయన పెద్ద పేగులో ఏముందో చూసిన డాక్టర్లకు దిమ్మతిరిగే షాక్!

Updated Date - 2023-11-28T17:02:20+05:30 IST