YouTube : ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌పై యూట్యూబ్ స్లో!
ABN , First Publish Date - 2023-11-24T23:53:26+05:30 IST
ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌పై యూట్యూబ్ కదలిక నెమ్మదిగా ఉంటుంది. అయితే అందుకు అప్లికేషన్‌లో పెట్టే యాడ్ బ్లాకర్స్ కారణమని గూగుల్ చెబుతోంది.
ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌పై యూట్యూబ్ కదలిక నెమ్మదిగా ఉంటుంది. అయితే అందుకు అప్లికేషన్‌లో పెట్టే యాడ్ బ్లాకర్స్ కారణమని గూగుల్ చెబుతోంది. అందుకే ప్రీమియమ్ వెర్షన్‌ని తీసుకోవాలని యూజర్లకు పదేపదే చెబుతోంది. అందులో యాడ్ బ్లాకర్స్‌కు అవకాశం ఉండదు. ప్రస్తుతం మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో అదే సమస్య తలెత్తుతోంది. 9టు5గూగుల్ రిపోర్ట్ ప్రకారం రెడ్డిట్ యూజర్లు స్లోడౌన్‌పై ఫిర్యాదు చేశారు. వారిలో ఒకరు వీడియోను షేర్ చేశారు. వెబ్ అప్లికేషన్ లోడింగ్ సమయంలో చోటుచేసుకుంటున్న గ్యాప్‌ని తను ఆ వీడియోలో చూపారు. స్లో కావడానికి ఇంటర్నెట్ కనెక్షన్ సంబంధిత లోపాలు కూడా కావచ్చు. గూగుల్ కూడా కారణం కావచ్చని కొందరు అంటుండటం విశేషం. అయితే యాడ్ బ్లాకర్ అందుకు కారణమని గూగుల్ చెబుతోంది. మొత్తానికి మొజిల్లా వరకు ఇదో సీరియస్ సమస్యగా ఉంది. యూట్యూబ్ విషయానికి వస్తే ప్రకటనలనతోనే వీడియో చూడటం మంచిదని యూజర్లకు చెబుతోంది.