Share News

కథానాయిక ఎవరు?

ABN , First Publish Date - 2023-11-12T05:22:32+05:30 IST

ప్రస్తుతం ‘దేవర’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్‌. ‘వార్‌ 2’ చిత్రంతో ఆయన బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరంలో ఈ చిత్రం..

కథానాయిక ఎవరు?

ప్రస్తుతం ‘దేవర’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్‌. ‘వార్‌ 2’ చిత్రంతో ఆయన బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా నటించే హీరోయిన్‌ ఎవరు అనేదానిపై సస్పెన్‌ ్స కొనసాగుతోంది. ‘వార్‌ 2’ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ ప్రస్తుతం హీరోయిన్ల వేటలో ఉన్నారట. దీపికా పదుకొనే, అలియాభట్‌ను ఎన్టీఆర్‌ సరసన నటింపజేసేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే సినీవర్గాలు ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నాయి. ‘వార్‌ 2’లో అలియా సీక్రెట్‌ ఏజెంట్‌గా అతిథి పాత్రలో మాత్రమే కనిపించనున్నారనీ, దీపిక ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తారని వారు చెబుతున్నారు. అధికారిక ప్రకటన వస్తేగానీ ఎన్టీఆర్‌ హీరోయిన్‌ ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Updated Date - 2023-11-12T05:22:33+05:30 IST