Trend Heels : అదిరేటి హీల్స్‌ మీరేస్తే...

ABN , First Publish Date - 2023-08-29T23:29:03+05:30 IST

స్టైల్‌గా కనిపించాలంటే డ్రస్సుకు తగిన హీల్స్‌ ఎంచుకోవాలి. బ్లంట్‌ హీల్స్‌, వెడ్జెస్‌, పంప్స్‌... ఇలా లెక్కలేనన్ని రకాల హీల్స్‌ మార్కెట్లో

Trend Heels : అదిరేటి హీల్స్‌ మీరేస్తే...

స్టైల్‌గా కనిపించాలంటే డ్రస్సుకు తగిన హీల్స్‌ ఎంచుకోవాలి.

బ్లంట్‌ హీల్స్‌, వెడ్జెస్‌, పంప్స్‌... ఇలా లెక్కలేనన్ని రకాల హీల్స్‌ మార్కెట్లో

దొరుకుతున్నప్పుడు, ఏ దుస్తులకు ఎలాంటి హీల్స్‌ ఎంచుకోవాలో

తెలుసుకోవడం అవసరం.

బ్లాక్‌ హీల్స్‌: శరీర బరువు మొత్తాన్నీ సమంగా భరించే ఈ బ్లాక్‌ హీల్స్‌ ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. ఫార్మల్‌ పాంట్స్‌, స్కర్ట్స్‌, ట్రౌజర్లకు ఈ రకం బ్లాక్‌ హీల్స్‌ చక్కగా సూటవుతాయి.

క్యూబన్‌ హీల్‌: ఈ హీల్‌ ఎత్తు మధ్యస్తంగా, లేదా పొట్టిగా ఉంటుంది. యాంకిల్‌ బూట్స్‌, లోఫర్స్‌, ఇతరత్రా క్లోజ్‌డ్‌ షూలన్నీ ఈ తరహాలోనే ఉంటాయి. ఈ రకం హీల్‌ షూలను క్యాజువల్‌ ప్యాంట్స్‌తో మ్యాచ్‌ చేయవచ్చు.

కోన్‌ హీల్స్‌: ఎత్తైన హీల్స్‌ ఇవి. వైబ్రెంట్‌గా కనిపించే షార్ట్‌ గౌన్స్‌, ఈవినింగ్‌ పార్టీ డ్రస్సె్‌సకు ఇవి సూటవుతాయి. మరీ ముఖ్యంగా మెరుపుతో కూడిన కోన్‌ హీల్స్‌ను రాత్రి పూట వేడుకల్లో ధరించాలి.

ఫ్లేర్‌ హీల్స్‌: ఫ్లేర్‌ ప్యాంటు తరహాలోనే విస్తరించినట్టు ఉండే ఫ్లేర్‌ హీల్స్‌ చూపులకు విభిన్నంగా ఉంటాయి. 70ల నాటి ఫ్లేర్‌ హీల్స్‌ ఆదరణ కోల్పోకుండా ఉండడానికి కారణం ఇవి ఎంతో సౌకర్యంగా ఉండడమే! చీరలు, చుడీదార్లు లాంటి సంప్రదాయ వస్త్రధారణకు ఈ తరహా హీల్స్‌ బాగుంటాయి.

ఫ్రెంచ్‌ హీల్‌: ఒక అంగుళం ఎత్తు మాత్రమే ఉండే ఈ హీల్స్‌ను ఎత్తైన అమ్మాయిలు ఎంచుకోవచ్చు. జీన్స్‌, జెగ్గింగ్స్‌తో పాటు ధరించడానికి ఇవి బాగుంటాయి.

హై హీల్‌: నాలుగు అంగుళాల ఎత్తుండే హీల్స్‌ అన్నీ ఈ కోవకే చెందుతాయి. వీటిలో పంప్స్‌, స్టిలెటోస్‌, హీల్‌డ్‌ శాండిల్స్‌ అనే రకాలూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి హీల్‌ రకాన్ని ఎంచుకోవాలి. పంప్స్‌ పబ్స్‌కూ, స్టిలెటో్‌సను పార్టీలకూ, హీల్‌డ్‌ శాండిల్స్‌ను ఇంటి వేడుకలకూ వాడుకోవచ్చు.

Updated Date - 2023-08-29T23:29:03+05:30 IST