Share News

అదే నా లక్ష్యం!

ABN , First Publish Date - 2023-11-26T01:26:38+05:30 IST

వాణీ కపూర్‌ ప్రస్తుతం లండన్‌లో ఉంది. తన చెల్లెలు, కుటుంబ సభ్యులతో ఎంజాయ్‌ చేయటానికి అక్కడికెళ్లింది.

అదే నా లక్ష్యం!

వాణీ కపూర్‌ ప్రస్తుతం లండన్‌లో ఉంది. తన చెల్లెలు, కుటుంబ సభ్యులతో ఎంజాయ్‌ చేయటానికి అక్కడికెళ్లింది. ఇన్‌స్టా వేదికగా ఈ అమ్మడు ఫొటోలు షేర్‌ చేస్తోంటే.. ‘క్యూట్‌గాళ్‌’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. నెటిజన్లు అలా కామెంట్‌ చేసినా చేయకపోయినా హాట్‌లుక్స్‌, ఫొటోషూట్స్‌తో మస్త్‌ ఫోజులిస్తుంటుంది వాణీ.

అలా చిత్రరంగంలోకి..

పంజాబీకి చెందిన ఈ అమ్మడు పుట్టిపెరిగింది ఢిల్లీలో. తండ్రి ఫర్నీచర్‌ వ్యాపారంలో ఉంటే తల్లి మార్కెటింగ్‌ రంగంలో పని చేసేది. వాణీ కపూర్‌ చదివింది ఢిల్లీలోనే. ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ డిగ్రీ చేసింది.. అది కూడా టూరిజంలో బ్యాచిలర్‌ డిగ్రీ. టూరిజం కాబట్టి కొన్ని హోటల్స్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసింది. అలా మోడలింగ్‌ చూడటం వల్ల ఈ రంగంలోకి రావాలనుకుంది. ఆమెకు పెద్దగా సినిమావాళ్లు తెలిసినవాళ్లు లేరు.

అయినా మోడలింగ్‌లోకి తొలి అడుగువేసింది. అలా ముంబై మకాం మార్చిన తర్వాత ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’ అనే చిత్రంలో తొలి అవకాశం వచ్చింది. అది కూడా యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో. దీంతో ఎగిరి గంతేసింది. తొలి సినిమానే కమర్షియల్‌ హిట్‌ కావటంతో బెస్ట్‌ ఫిమేల్‌ డెబ్యూట్‌ అవార్డు అందుకుంది. ఆ తర్వాత వాణీ వెనక్కి చూడలేదు.

అందుకే అలా ఉంటా..

చాలామంది ‘ఇంత క్యాజులవల్‌ లుక్స్‌లో.. బీచ్‌ సైడ్‌లా కంఫర్టబుల్‌ బికీని ఫొటోషూట్స్‌ ఇస్తావు’ అని అడుగుతారంటుంది. అయితే ‘ఫిట్‌గా ఉండటమే హీరోయిన్‌కు కావాల్సింది. ఏ పాత్ర ఎలా ఉంటుందో తెలీదు. నిత్యం జిమ్‌కు వెళ్లటం.. వర్కవుట్స్‌ చేయటం అలవాటుగా మార్చుకున్నాను’ అంటుందీమె. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయటమే నా లక్ష్యం. అయితే అందుకోసం డబ్బులు మరీ కావాలని పట్టుబడను.. మంచి పాత్రలు ముఖ్యం అంటుంది ఈ కథానాయిక. కంగనా, ప్రియాంక చోప్రా, దీపికా పదుకోన్‌, అనుష్కశర్మలు ఫ్యాషన్‌ను ఫాలో అవటంలో ఎక్స్‌పర్ట్స్‌. వాళ్లను ఫాలో అవుతుంటా. ఇంట్లో ఉంటే పాస్తా లాంటి ఇన్‌స్టంట్‌ వంటకాలు చేయట ఇష్టం. మ్యాగీ, పరోటా, మామిడికాయ ఊరగాయ అంటే ఎంతో ఇష్టం. నాకిష్టమైన కుక్కతో ఆడుకుంటుంటా.

అంతకంటే ఏం కావాలి..

సోషల్‌మీడియాలో 80 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎలాంటి ఫొటో షేర్‌ చేసినా వైరల్‌ అవుతుంది. ఇంత మంది ఆదరాభిమానాలు దక్కటం అదృష్టమే అంటుంది వాణీకపూర్‌. ట్రావెలింగ్‌ అంటే ఇష్టం. ముంబై తర్వాత ఇష్టమైన ప్రదేశం ప్యారిస్‌. మంచి పాత్రల్లో నటించాలి. అవకాశం వస్తే దక్షిణాది చిత్రాల్లో మళ్లీ నటించటానికి రెడీ అంటుంది వాణీకపూర్‌.

అలా పాపులర్‌..

తెలుగులో ‘ఆహా కళ్యాణం’లో నటించింది. ఆ తర్వాత రన్వీర్‌ జోడీగా ‘బేఫికర్‌’ చిత్రంలో నటించినప్పుడు యూత్‌ అభిమానులను సంపాదించుకుంది. ‘వార్‌’, అక్షయ్‌ కుమార్‌ చిత్రం ‘బెల్‌బాటమ్‌’, రణ్బీర్‌తో ‘షమ్‌షేరా’ లాంటి చిత్రాల్లో అగ్రకథానాయకులతో నటించింది. ‘ఏ సినిమా అయినా అవకాశం రావటమే అదృష్టం. ప్రతి చిత్రాన్ని సవాల్‌గా తీసుకుని చేశానంటుంది’ వాణీకపూర్‌.

Updated Date - 2023-11-26T01:26:39+05:30 IST