Uban : ఉబన్‌ ట్రాన్స్‌పరెంట్‌ పవర్‌ బ్యాంక్‌

ABN , First Publish Date - 2023-02-24T23:23:19+05:30 IST

దేశీయ కన్జూమర్‌ ఎలకా్ట్రనిక్‌ బ్రాండ్‌ ఉబన్‌ తాజాగా పీబీ-ఎక్స్‌35 ట్రాన్స్‌పరంట్‌ పవర్‌ బ్యాంక్‌ని విడుదల చేసింది. మన దేశంలో ఇదే తొలి ట్రాన్స్‌పరంట్‌ పవర్‌ బ్యాంక్‌. దీనికి 10000ఎంఏహెచ్‌ బ్యాటరీ యూనిట్‌ ఉంది.

Uban : ఉబన్‌ ట్రాన్స్‌పరెంట్‌ పవర్‌ బ్యాంక్‌

దేశీయ కన్జూమర్‌ ఎలకా్ట్రనిక్‌ బ్రాండ్‌ ఉబన్‌ తాజాగా పీబీ-ఎక్స్‌35 ట్రాన్స్‌పరంట్‌ పవర్‌ బ్యాంక్‌ని విడుదల చేసింది. మన దేశంలో ఇదే తొలి ట్రాన్స్‌పరంట్‌ పవర్‌ బ్యాంక్‌. దీనికి 10000ఎంఏహెచ్‌ బ్యాటరీ యూనిట్‌ ఉంది. 22.5 వాట్స్‌ కలిగి ఉన్న ఇది సాధారణ పవర్‌ బ్యాంక్‌ల కంటే వేగంగా చార్జింగ్‌కు వీలు కలిగిస్తుందని కంపెనీ చెబుతోంది. ట్విన్‌ ఇన్‌పుట్‌ చార్జింగ్‌ కనెక్టర్స్‌ అంటే ఒకేసారి రెండు డివైజ్‌లకు చార్జింగ్‌ సౌలభ్యం ఉంటుంది. 2.0ఏ ఔట్‌పుట్‌ చార్జింగ్‌ పోర్ట్‌ ఉన్నాయి. ఇది లిథియం పాలిమర్‌ బ్యాటరీ కాగా ఫాస్ట్‌ చార్జింగ్‌కు అవకాశం కల్పిస్తుంది. ఓవర్‌ హీట్‌ అలాగే షార్ట్‌ సర్క్యూట్‌ నుంచి ప్రొటెక్షన్‌ కూడా ఉంది. టాబ్లెట్స్‌, కెమెరాలు, హెడ్‌ఫోన్లు, ఆండ్రాయిడ్‌ డివైజ్‌లతోపాటు సి-ఎనేబుల్డ్‌ డివైజ్‌లకు చార్జింగ్‌ చేసుకోవచ్చు. దీని ధర రూ.3,699 కాగా కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు.

Updated Date - 2023-02-24T23:23:20+05:30 IST