Share News

Saddula Bathukamma : నేడు సద్దుల బతుకమ్మ

ABN , First Publish Date - 2023-10-22T00:13:18+05:30 IST

బతుకమ్మ వేడుకల్లో తొమ్మిదో రోజు, చివరి రోజు అయిన ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి- ఆదివారం) నాడు ‘సద్దుల బతుకమ్మ’

 Saddula Bathukamma : నేడు సద్దుల బతుకమ్మ

బతుకమ్మ వేడుకల్లో తొమ్మిదో రోజు, చివరి రోజు అయిన ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి- ఆదివారం) నాడు ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద బతుకమ్మ’గా గౌరమ్మను ఆరాధిస్తారు.. పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సద్దులను నైవేద్యం పెట్టి, పూజలు చేస్తారు. అనంతరం రాత్రి వరకూ ఆటపాటలతో అమ్మవారిని కొలిచి, బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.

నైవేద్యాలు: మలీద ముద్దలు (లడ్లు), చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం. నువ్వుల అన్నం, పెరుగన్నం తదితరాలు.

Updated Date - 2023-10-22T00:13:18+05:30 IST