Breakfast: ఆహా.. అల్పాహారం!
ABN , First Publish Date - 2023-07-29T03:18:00+05:30 IST
ఆహారం ఓ అద్భుతమైన సైన్స్. మంచి ఆహారం తింటుంటే మూడ్ ఇట్టే మారిపోతుంది. మనసు ప్రశాంతం అవుతుంది. చక్కని ఆరోగ్యం చేకూరుతుంది. కేరళలో చేసుకునే రాగి పుట్టు, నూరుక్కు గోతాంబు ఉప్పుమావు, రవ్వ పొంగల్... ఇలాంటి ఆహారమే. బ్రేక్‌ఫాస్ట్ కోసం చేసుకునే ఈ మలయాళ ఫుడ్‌ను సులువుగా చేసుకోవచ్చు ఇలా..
కేరాఫ్ కేరళ

రాగి పుట్టు
కావాల్సిన పదార్థాలు:
రాగిపిండి- కప్పు, నీళ్లు- అరకప్పు, ఉప్పు- తగినంత, ఒక బీరకాయ- 100 గ్రాములు, పసుపు- కొద్దిగా, పెప్పర్- పావు టీస్పూన్, తురిమిన కొబ్బరి- కప్పు, పుట్టు మేకర్-1
తయారీ విధానం:
ఒక బౌల్‌లో రాగిపిండి వేసి అందులో ఉప్పు వేశాక.. నీళ్లు కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి. ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత బీరకాయను శుభ్రం చేసి హాఫ్ ఎమ్.ఎమ్. ఉండేంత వరకూ తరిగిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక కప్పులో వేయాలి. ఇందులోకి కాస్త పసుపు, పెప్పర్, రుచికోసం కొద్దిగా ఉప్పు వేయాలి. ఇందులోకి కొబ్బరి తురుము వేసి బాగా చేత్తో కలపాలి. ఆ తర్వాత పుట్టు మేకర్ బౌల్‌లో నీళ్లు పోసి బాగా వేడి చేస్తూండాలి. అప్పుడే పుట్టు మేకర్‌లో కిందభాగంలో బీరకాయ, కొబ్బరికలసిన మిశ్రమాన్ని టేబుల్ స్పూన్ వేయాలి. దాని మీద మూడు టేబుల్ స్పూన్ల రాగిపిండి మిశ్రమం వేయాలి. ఇలా ఒకదానిపైన ఒకటి లేయర్లుగా వేయాలి. పైన లేయర్ బీరకాయ-కొబ్బరితురుము మిశ్రమం వేయాలి. పుట్టు మేకర్‌పైన మౌల్డ్ క్లోజ్ చేయాలి. నీళ్లు కాగే పుట్టుమేకర్ బౌల్‌మీద పుట్టు మేకర్‌ను ఉంచాలి. ఎనిమిది నిముషాల పాటు అలానే ఉంచాలి. కుక్కర్‌లా పుట్టుమేకర్‌పైన నుంచి ఆవిరిపొగ వస్తుంది. హీట్‌నుంచి పుట్టు మేకర్‌ను తీసేసి అందులోని మిశ్రమాన్ని బయటికి తీస్తే రోల్‌లా ఉండే రాగి పుట్టు రెడీ. అరటిపండు, నెయ్యితో కలపి తినాలి లేదా టమోటా చట్నీతో తినాలి.

రవ్వ పొంగల్
కావాల్సిన పదార్థాలు:
పచ్చ పెసరపప్పు- పావు కప్పు, నీళ్లు- ముప్పావు కప్పు, గోధుమరవ్వ- అరకప్పు, నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు, తురిమిన అల్లం- 2 టీస్పూన్లు, పచ్చిమిర్చి-1 (సన్నగా తరగాలి), బ్లాక్‌పెప్పర్- 2 టీస్పూన్లు, జీలకర్ర- టీస్పూన్, జీడిపప్పు-8, ఎండు ద్రాక్ష- 6, ఉప్పు- రుచికి తగినంత
తయారీ విధానం:
ప్యాన్‌లో పెసరపప్పును మీడియం హీట్‌లోలో మూడు నిముషాల పాటు వేయించాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో పెసరపప్పు, ముప్పావు కప్పు నీళ్లు వేసి కుక్ చేయాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేసి లోఫ్లేమ్‌లో ఐదు నిముషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత దీన్ని బౌల్‌లో వేసుకుని చిన్న చెక్క కవ్వంతో మాష్ చేయాలి.
ప్యాన్ మీడియమ్ హీట్ అయ్యాక గోధుమరవ్వను వేసి మూడు నిముషాల పాటు ప్యాన్‌ను కదుపుతూ రోస్ట్ చేయాలి. రవ్వ రంగు మారాక పక్కన ఉంచి చల్లబర్చాలి.
సాస్‌ప్యాన్ మీడియమ్ హీట్ అయ్యాక అందులో నెయ్యి వేసిన తర్వాత తురిమిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, బ్లాక్ పెప్పర్, జీలకర్ర, జీడిపప్పు, ఎండిన ద్రాక్ష ఒకదాని తర్వాత మరోటి వేయాలి. అన్నీ మిక్స్ అయ్యేట్లు ప్యాన్‌ను స్టిర్ చేయాలి. ఆ తర్వాత పెసరపప్పును వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి రుచికి సరిపోయేట్లు ఉప్పు వేసి ఉడికించాలి, ఇందులోకి రోస్టెడ్ గోధుమరవ్వను చేర్చాలి. మిక్స్ చేసి ప్యాన్‌ను స్టిర్ చేయాలి. చివరగా లోఫ్లేమ్‌లో ఐదు నిముషాల పాటు ఉడికించాలి. గోధుమరవ్వ సాఫ్ట్ అవుతూనే దించేసుకోవాలి. దీన్ని టమోటా చట్నీతో తింటే మరింత రుచికరంగా ఉంటుంది.

నూరుక్కు గోతాంబు ఉప్పుమావు
కావాల్సిన పదార్థాలు:
గోధుమ నూక- రెండు కప్పులు, నెయ్యి- 100 గ్రాములు, ఆవాలు- పావు టీస్పూన్, కరివేపాకు- పది ఆకులు, చిన్న ఉల్లిపాయ- 1 (సన్నగా తరగాలి), బంగాళదుంప-1 (చిన్న క్యూబ్స్‌లా కట్ చేసుకోవాలి), టమోటా- 1 (చిన్న క్యూబ్స్‌లా కట్ చేసుకోవాలి), క్యారెట్- 1 (చిన్న క్యూబ్స్‌లా కట్ చేసుకోవాలి), బీన్స్- 100 గ్రాములు (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి- 2 (సన్నగా తరగాలి), అల్లం ముక్క- ఇంచు (సన్నగా తరగాలి), ఉప్పు- రుచికి తగినంత, నీళ్లు- నాలుగున్న కప్పు, తరిగిన పుదీనా- కొద్దిగా, తరిగిన కొత్తిమీర- కొద్దిగా
తయారీ విధానం:
ప్యాన్ మీడియమ్ హీట్ అయ్యాక గోధుమనూక వేసి మూడు నిముషాల పాటు ప్యాన్‌ను కదుపుతూ డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాత ఒక ప్లేట్‌లో వేసి చల్లబర్చాలి. అదే ప్యాన్‌లో నెయ్యి వేయాలి. కొద్దిగా వేడి అయ్యాక ఆవాలు వేసి గరిటెతో కదిపిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేయాలి. మూడు నిముషాల పాటు గరిటెతో కదుపుతూ ఉంటే ఉల్లిపాయలు రంగు మారుతుంది. ఆ తర్వాత బంగాళదుంపల ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసిన తర్వాత ప్యాన్ కదుపుతూ రెండు నిముషాల పాటు స్టిర్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ప్యాన్‌మీద మూత ఉంచి మూడు నిముషాల పాటు కుక్ చేయాలి. ఆ తర్వాత నీళ్లు పోయాలి. కూరగాయల్ని బాగా ఉడకబెట్టాలి. కూరగాయలన్నీ ఉడికిన తర్వాత లో ఫ్లేమ్‌లో ఉంచి మెల్లమెల్లగా గోధుమనూక మెల్లమెల్లగా పోయాలి. ఉండలు కట్టకుండా జాగ్రత్తపడాలి. ఐదారు నిముషాల పాటు కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీర, పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుని టమోటా చట్నీతో తింటే రుచికరంగా ఉంటుంది.