Share News

You Know : ఈ చాక్లెట్‌ ఆరోగ్యకరం

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:20 AM

తీయగా, నోట్లో వేసుకోగానే కరిగిపోయే చాక్లెట్లను ఇష్టంగా తింటూ ఉంటాం. కానీ చాక్లెట్లలో షుగర్‌ ఎక్కువ కాబట్టి వాటిని పరిమితంగానే తినాలని అంటూ ఉంటారు. అయితే ఏ

You Know : ఈ చాక్లెట్‌ ఆరోగ్యకరం

తీయగా, నోట్లో వేసుకోగానే కరిగిపోయే చాక్లెట్లను ఇష్టంగా తింటూ ఉంటాం. కానీ చాక్లెట్లలో షుగర్‌ ఎక్కువ కాబట్టి వాటిని పరిమితంగానే తినాలని అంటూ ఉంటారు. అయితే ఏ చాక్లెట్‌ ఆరోగ్యకరం?

స్వీట్‌, సెమి స్వీట్‌, డార్క్‌.. ఇలా మూడు రకాల చాక్లెట్లు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. వీటిలో డార్క్‌ చాక్లెట్‌ ఆరోగ్యకరమైనది. దీన్లో చక్కెర నామమాత్రంగా ఆరోగ్యకరమైన కొకొ సమృద్ధిగా ఉంటుంది. రుచి కూడా తీయగా కాకుండా చిరు చేదుగా ఉంటుంది. చాక్లెట్‌ ఎంత చేదుగా ఉంటే అది అంత ఆరోగ్యకరమైనదని గుర్తు పెట్టుకోవాలి. దీన్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. రక్తప్రసారాన్ని పెంచి, అధిక రక్తపోటును తగ్గిస్తాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ నుంచి రక్షణ కల్పిస్తాయి. డార్క్‌ చాక్లెట్లలో ఉండే ఒక రసాయనం, మెదడులో సెరటోనిన్‌ స్రావాన్ని పెంచి, న్యూరోట్రాన్స్‌మీటర్లను రిలాక్స్‌ చేసి, కమ్మని నిద్ర పట్టేలా చేస్తుంది. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాలున్న డార్క్‌ చాక్లెట్లను తరచూ తినవచ్చు. హృద్రోలకు డార్క్‌ చాక్లెట్‌ ఆరోగ్యకరం.

Updated Date - Dec 26 , 2023 | 12:20 AM