Lakshmiputra : ఆగిపోయిన హీరో కృష్ణ ‘లక్ష్మీపుత్రుడు’..

ABN , First Publish Date - 2023-02-19T03:21:58+05:30 IST

కృష్ణ ఆశీస్సులతో నిర్మాతగా మారారు ఆయన బావమరిది సూర్యనారాయణబాబు. విజయనిర్మల దర్శకత్వంలో ‘రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌’ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1984లో హీరో కృష్ణ, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘కంచు కాగడా’ చిత్రం షూటింగ్‌ జరుగుతున్నప్పుడు బావమరిది సూర్యనారాయణబాబుని పిలిచి డేట్స్‌

Lakshmiputra : ఆగిపోయిన హీరో కృష్ణ ‘లక్ష్మీపుత్రుడు’..

కృష్ణ ఆశీస్సులతో నిర్మాతగా మారారు ఆయన బావమరిది సూర్యనారాయణబాబు. విజయనిర్మల దర్శకత్వంలో ‘రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌’ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1984లో హీరో కృష్ణ, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘కంచు కాగడా’ చిత్రం షూటింగ్‌ జరుగుతున్నప్పుడు బావమరిది సూర్యనారాయణబాబుని పిలిచి డేట్స్‌ ఇస్తానని, కోదండ రామిరెడ్డి నీ దర్శకుడిగా పెట్టుకుని సినిమా తీయమని హీరో కృష్ణ చెప్పారు.ఈ విషయం కోదండరామిరెడ్డికి చెబితే ఆయన సరేనన్నారు. వెంటనే ఆ ఏడాది హీరో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31 న కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘లక్ష్మీపుత్రుడు’ చిత్రాన్ని తియనున్నట్లు పేపర్‌ లో ప్రకటన ఇచ్చారు సూర్యనారాయణబాబు. ఆ రోజుల్లో హీరో కృష్ణ డేట్స్‌ ఇస్తే చాలు నిర్మాత పంట పండి నట్లే. లక్ష్మీ దేవి వెదుక్కుంటూ ఇంటికి వచ్చినట్లే అని నిర్మాతలు భావించేవారు. అందుకే తన సినిమాకు లక్ష్మీ పుత్రుడు అని పేరు పెట్టార ుసూర్యనారాయణ బాబు. అయితే ఈ టైటిల్‌ కృష్ణకు నచ్చలేదు. మార్చమని బావమరిది కి చెప్పారు. ఆ టైటిల్‌ మార్చడం సూర్యనారాయణబాబుకి ఇష్టం లేదు. అందుకే ‘ఇది బాగుంటుంది బావా’ అని హీరో కృష్ణకు చెప్పారు కానీ ఆయన ఒప్పుకోలేదు. టైటిల్‌ విషయం లో బావా బావమరుదుల మధ్య చర్చలు జరిగేవి. ఎవరూ వెనక్కి తగ్గలేదు. కృష్ణ ఆ టైటిల్‌ను అంగీకరిస్తారనే నమ్మకంతో తమిళ రచయిత ఎం. డి. సుందర్‌ని పిలిచి ‘లక్ష్మీపుత్రుడు’ టైటిల్‌ కి తగ్గ కథ తయారు చేయమని చెప్పారు సూర్యనారాయణబాబు.. కథ సిద్ధం అయింది కానీ కృష్ణగారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. సూర్యనారాయణబాబు వెనక్కి తగ్గలేదు. మూడేళ్లు అలాగే గడిచి పోయయి. ఆ తర్వాత హీరో కృష్ణ తన బావమరిదిని పిలిచి, లక్ష్మీ పుత్రుడు చిత్రం గురించి మరచి పొమ్మని, తను, మహేశ్‌ కలసి శంఖారావం చిత్రం చేస్తామని చెప్పారు. అలా సూర్యనారాయణబాబు నిర్మాతగా, హీరో కృష్ణ దర్శకత్వంలో 1987లో శంఖారావం చిత్రం రూపుదిద్దుకొంది. సూర్యనారాయణబాబు. కోదండ రామిరెడ్డి కి ఇచ్చిన అడ్వాన్స్‌ అలాగే ఉండిపోవడంతో హీరో కృష్ణ సలహా పై రమేశ్‌బాబు, మహేశ్‌బాబు హీరోలుగా ‘బజారు రౌడీ ’ చిత్రాన్ని నిర్మించారు సూర్యనారాయణ బాబు.

Updated Date - 2023-02-19T03:22:00+05:30 IST