Fridge: ఫ్రీజర్‌ ఎందుకు పైనే ఉంటుంది..? ఇళ్లల్లో ఫ్రిడ్జ్‌ను వాడేవాళ్లల్లో 99 శాతం మందికి తెలియని నిజం ఏంటంటే..!

ABN , First Publish Date - 2023-08-23T11:03:19+05:30 IST

ఫ్రీజర్ ఫ్రిజ్‌లోని మిగిలిన కంపార్ట్‌మెంట్‌లను యాక్సెస్ చేయడానికి మళ్లీ మళ్లీ వంగవలసిన అవసరం లేకుండా ఆప్షన్స్ ఉన్నాయి.

Fridge: ఫ్రీజర్‌ ఎందుకు పైనే ఉంటుంది..? ఇళ్లల్లో ఫ్రిడ్జ్‌ను వాడేవాళ్లల్లో 99 శాతం మందికి తెలియని నిజం ఏంటంటే..!
compartment

ఫ్రిజ్ లేకపోతే ఇప్పటి రోజుల్లో కురగాయలు, పండ్లు, పాలు నిల్వచేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ అనేది సర్వసాధారణ వస్తువైపోయింది. బీదా, గొప్ప బేధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఫ్రిజ్ కావాల్సిన వస్తువే. అయితే ఫ్రిజ్ ని ఇన్నేళ్ళుగా వాడేస్తున్నాం కానీ.. దీని గురించి మనకు ఎందవరకూ తెలుసు.. అసలు ఫ్రిజ్ లో పై భాగంలో ఫ్రీజర్ ఉంటుంది కదా.. ఇది ఫ్రిజ్ కి పైనే ఎందుకు ఇస్తారు..

ఫ్రిజ్ దిగువ భాగంలో ఫ్రీజర్ ఎందుకు ఉండదు. ఎప్పుడన్నా ఆలోచించారా. అధిక ఉష్ణోగ్రత కారణంగా, ఫ్రిజ్‌లు నగరాల్లో, గ్రామాల్లో తేడా లేకుండా తప్పకుండా వాడుతున్నాం.. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయి. అయితే రిఫ్రిజిరేటర్‌లలో, ఫ్రీజర్ పైభాగంలో ఉండటాన్ని గమనించే ఉంటారు.. ఇలా ఉండడానికి, దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం.

ఇంట్లో ఫ్రిజ్‌ని కూడా ఉపయోగిస్తుంటే, చాలా మోడల్స్‌లో ఫ్రీజర్ పైన ఉండేలా చూసుకోవాలి. రిఫ్రిజిరేటర్‌లో చల్లదనానికి మూలం ఫ్రీజర్. ఫ్రీజర్‌ను పైభాగంలో ఉంచినప్పుడు, దాని నుండి వచ్చే చల్లని గాలి దిగువన ఉన్న వెడి గాలి కంటే దట్టంగా ఉంటుంది. ఇదే ప్రధాన కారణం.


ఇది కూడా చదవండి: నిద్ర సరిగా పోవడం లేదా..? అయితే ఈ 10 ప్రమాదకర పరిస్థితులు వెంటాడటం ఖాయం..!

అటువంటి పరిస్థితిలో, చల్లని గాలి దట్టంగా, ఫ్రిజ్ లో స్థిరపడుతుంది. ఇక వేడి గాలి పెరగడానికి అవకాశమే ఉండదు. కాబట్టి వేడి గాలి పైకి లేచినప్పుడు, ఫ్రీజర్‌లో చల్లగా ఉంటుంది. సింగిల్ కంపార్ట్మెంట్ ( single compartment ) రిఫ్రిజిరేటర్ల ఏకరీతి శీతలీకరణ సూత్రం ఇది.

కొన్ని ఖరీదైన రిఫ్రిజిరేటర్లలో, ఫ్రీజర్ ఫ్రిజ్‌లోని మిగిలిన కంపార్ట్‌మెంట్‌లను యాక్సెస్ చేయడానికి మళ్లీ మళ్లీ వంగవలసిన అవసరం లేకుండా ఆప్షన్స్ ఉన్నాయి. చిన్న సైజు ఫ్రిజ్ లు కూడా చాలావరకూ మార్కెట్ లోకి వస్తున్నాయి. వీటిలో ఫ్రీజర్ లేకపోయినా కూలింగ్ వరకూ వీటిని వాడవచ్చు.

Updated Date - 2023-08-23T11:03:19+05:30 IST