Jeans: జీన్స్ ప్యాంట్లకు ఇంత చిన్న పాకెట్స్ పెట్టడం వెనుక అసలు కారణం ఇదన్నమాట.. ఫోన్లు, పర్సుల కోసం కాదు కానీ..!

ABN , First Publish Date - 2023-09-06T10:28:24+05:30 IST

ఇప్పటి కాలానికి కూడా ఈ చిన్న పాకెట్స్ వస్తున్నాయంటే వాటిని ఇంకా వాడుతూ ఉండటమే కారణం..

Jeans: జీన్స్ ప్యాంట్లకు ఇంత చిన్న పాకెట్స్ పెట్టడం వెనుక అసలు కారణం ఇదన్నమాట.. ఫోన్లు, పర్సుల కోసం కాదు కానీ..!
small pocket's

జీన్స్ ప్యాంట్లు లేదా ట్రౌజర్స్ గానీ ప్యాంట్లు ఏదైనా చూస్తే వాటికి పెద్ద జేబుల పక్కనే చిన్న పాకెట్ ఒకటి ఉంటుంది. కొన్ని ప్యాంట్లుకి కుడి పాకెట్ పైన ఉంటే, కొన్ని ప్యాంట్స్ కి బెల్ట్ పెట్టుకునే కింద ఉంటుంది. ఇది ఎందుకు పెడతారో తెలుసా? దీని ఉపయోగం ఏంటి? ఈ పాకెట్ కి వేరే ప్రత్యేకత ఉందా? అంటే ఉందనే అంటున్నారు. అదేమిటో తెలుసుకుందాం.

జీన్స్ చాలా మందికి ఇష్టమైన, సౌకర్యవంతమైన వేషధారణ అయితే, మొదటి జీన్స్ 1871లో జాకబ్ డబ్ల్యు. డేవిస్‌ కనుగొన్నాడు. 1873లో డేవిస్, లెవి స్ట్రాస్ చేత పేటెంట్ పొందింది. ఈ జీన్స్ కి చిన్న పాకెట్ ని అప్పుడే పరిచయం చేశారు, ఇది మొదట్లో పాకెట్ వాచీలను ఉంచడానికి అనుకూలమైన, సురక్షితమైన ప్రదేశంగా వాడేవారు.

1800లలో కౌబాయ్ కల్చర్ నడిచినప్పటి సంగతి.. అంటే డ్రెస్సింగ్ అంతా కౌబాయ్ లా ఉండే కాలంలో.. టోపీ, జాకెట్, షూస్ లతో పాటు.. జీన్స్ లకు చిన్న పాకెట్ ఉండేది. ఇది ఎందుకంటే.. చేతికి పెట్టుకుని వాచ్ కంటే అప్పుడు పాకెట్ వాచ్ ఉపయోగించేవాళ్లు. వాటిని ఫ్యాట్ జేబులో పెట్టుకోడానికి ఈ పాకెట్స్ వాడేవారట.. ఈ జేబులను.. వాచ్ పాకెట్ అని పిలుస్తారు. పాకెట్ వాచెస్ వాడకం తగ్గిన తర్వాత.. దాదాపు ఈ పాకెట్ వాడకం తగ్గినా కూడా పాకెట్ మాత్రం కామన్ గా కనిపిస్తూనే ఉంది. మనవాళ్ళు చిల్లర వేయడానికో, మరో దానికో వాడినా ఇది 1800 నాటి ఫ్యాషన్ కావడం, దానిని ఇంకా వాడకంలో ఉంచడం అంటే కాస్తంత గొప్పే కదా..

సమయం గడిచేకొద్దీ, ఫ్యాషన్ పోకడలు మారుతూ వచ్చినా, పాకెట్ గడియారాలు తక్కువగా మారాయి. అయితే, జీన్స్‌లోని చిన్న జేబు మాత్రం అలాగే ఉంది. పాకెట్స్‌పై రివెట్స్, బటన్ ఫ్లై, ఆర్చ్డ్ బ్యాక్ పాకెట్ స్టిచింగ్, లెదర్ ప్యాచ్ వంటి ఫీచర్లతో పాటు బ్లూ జీన్స్ వరకూ ఆ డిజైన్ కామన్ అయిపోయింది.

ఇది కూడా చదవండి: అసలేంటీ ఈ బ్లూ టీ..? గ్రీన్ టీ తో పోల్చితే తేడా ఏంటి..?


ఇప్పటి కాలానికి కూడా ఈ చిన్న పాకెట్స్ వస్తున్నాయంటే వాటిని ఇంకా వాడుతూ ఉండటమే కారణం.. చాలామంది వీటిలో ఎయిర్‌పాడ్‌లు, ఎమర్జెన్సీ పిన్‌లు, హెయిర్ బ్యాండ్‌లు, లైటర్‌లు వంటి వస్తువులను పెట్టేందుకు ఉపయోగిస్తారు. గడిచిన కాలానికి గుర్తుగా, ఒకప్పటి ఫ్యాషన్ ని ఇప్పటికీ కొనసాగించడం అంటే అదో గొప్ప సంగతే కదా.. మరి.

Updated Date - 2023-09-06T10:28:24+05:30 IST