బహుమతులు అందుకున్న రాజుగారు!

ABN , First Publish Date - 2023-03-26T01:08:48+05:30 IST

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలోని ప్రజలు సుభిక్షంగా ఉండేవారు. రాజుగారు చాలా మంచివారు. ఆయనకు కోపం తక్కువ. ప్రజలనూ ప్రేమించే గుణం ఉంది.

బహుమతులు అందుకున్న రాజుగారు!

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలోని ప్రజలు సుభిక్షంగా ఉండేవారు. రాజుగారు చాలా మంచివారు. ఆయనకు కోపం తక్కువ. ప్రజలనూ ప్రేమించే గుణం ఉంది. ఈ విషయం ఆ రాజ్యంలోని ప్రజలందరికీ తెలుసు. అయితే ఎప్పుడూ రాజుగారి ఆజ్ఞలకు కట్టుబడి ఉండేవాళ్లు. ఆ ఊరిలో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పనిపాటా లేకుండా తిరిగేవాడు. చెట్లకింద కబుర్లు చెప్పటం, నిద్రపోవటం చేసేవాడు. అందరూ అతని సోమరి అనేవాళ్లు. ఒకరోజు ఉదయాన్నే రాజాస్థానంలో గేటు బయల నిల్చొని ఉన్నాడు రంగయ్య. అది కోడిని చేతులో పెట్టుకుని నిల్చున్నాడు. గంటపాటు అలానే నిల్చున్నాడు. పైనుంచి చూసి తన దగ్గరకు రమ్మన్నాడు రాజుగారు. వచ్చిన ఆ వ్యక్తి తన పేరు రంగయ్య అని పరిచయం చేస్కున్నాడు. ‘అయితే’ అన్నాడు రాజుగారు. ‘ఏమీలేదు మహారాజా.. ఈ కోడి మీ పేరు మీద పందెం కట్టాను. ఇది నాకు వచ్చింది. అయితే వాస్తవానికి ఇది మీకు చెందాలి. అందుకే ఇవ్వాలని వచ్చాను’ అన్నాడు. క్షణం కూడా ఆలోచించకుండా.. ‘వెళ్లి కోళ్లను చూసుకునే మా పనివాడికి ఇచ్చేయ్‌’ అన్నాడు. ‘చిత్తం మహారాజా’ అని రంగయ్య వెళ్లిపోయాడు.

కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఒకరోజు గేటు దగ్గర రంగయ్య నిలుచొని ఉన్నాడు. రాజుగారు దగ్గరకు భటులు తీసుకుని పోయారు. రంగయ్యను గుర్తు పట్టారు రాజుగారు. ‘ఈ మేక మీ పేరు మీద పందెం కాస్తే వచ్చింది. ఇది మీకే చెందుతుంది’ అన్నాడు రంగయ్య. ‘ఇది మేకలు మేపే వాడికి ఇవ్వు’ అన్నాడు రాజుగారు. సరే అంటూ వెళ్లిపోయాడు రంగయ్యం. కొన్నాళ్ల తర్వాత మళ్లీ వచ్చాడు రంగయ్య. ఈసారి తన పక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ‘ఎలాగైనా రాజుగారిని కలవాలి వెంటనే’ అన్నాడు రంగయ్య. ఏదో తెలిసిన వ్యక్తి కాబట్టి భటులు లోనికి పంపారు. రాజుగారిని కలుస్తూనే రంగయ్య ‘మహారాజావారు’ అంటూ నాటకాలాడటం మొదలెట్టారు. విషయం కనుక్కున్నాడు రాజుగారు. ‘ఏమీ లేదయ్యా.. మీ మీద పందెం కాశాను. ఐదువేల రూపాయలు పోయాయి. అయితే నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. వీరి ఇద్దరికీ బాకీ ఉన్నా’ను అన్నాడంతే. రాజుగారికి కోపం వచ్చినా ఏమీ అనలేకపోయారు. ఆ రెండు బహుమతులు తీసుకున్నందుకు తప్పదు సాయం అనుకున్నారు. ఏమీ అనకుండా రంగయ్యకు డబ్బులు ఇచ్చి పంపించారు రాజుగారు. ‘రంగయ్యా.. ఒకమాట ఈసారి నా మీద పందెం కాస్తే జైల్లల పెడతాను. జీవితఖైదీగా ఉంచుతాను’ అన్నాడు. రంగయ్య బిత్తరపోయి వెళ్లిపోయాడు.

Updated Date - 2023-03-26T01:08:48+05:30 IST