ఇండియాలోనే హయ్యెస్ట్ పెయిడ్ విలన్
ABN , Publish Date - Dec 31 , 2023 | 04:40 AM
వెండితెర మీద ఇప్పుడు విలన్లు వెలిగిపోతున్నారు. పారితోషికం విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్నారు.
వెండితెర మీద ఇప్పుడు విలన్లు వెలిగిపోతున్నారు. పారితోషికం విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్నారు. ఒక్కో సినిమాకు వీళ్లు తీసుకుంటున్న పారితోషికం వివరాలు వింటుంటే మతి పోతుంది. విలన్‌కు నిజంగా ఇంతా సీన్ ఉందా అనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న విలన్ ఎవరో తెలుసా? తమిళ నటుడు విజయ్ సేతుపతి. షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాకు ఆయన రూ. 21 కోట్లు తీసుకుని సంచలనం సృష్టించారు. ఆ తర్వాత స్థానంలో జాన్ అబ్రహాం ఉన్నారు. ‘పఠాన్’ చిత్రంలో విలన్‌గా నటించినందుకు ఆయన రూ. 20 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ‘లియో’ చిత్రం కోసం రూ. ఎనిమిది కోట్లు తీసుకుని విలన్‌గా నటించారు సంజయ్‌దత్.. అలాగే ‘టైగర్ 3’లో విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మి కూడా రూ. ఎనిమిది కోట్లు తీసుకున్నారు.