మీకు తెలుసా బాతు

ABN , First Publish Date - 2023-09-25T23:43:32+05:30 IST

బ్రిటన్‌లో పారా అని పిలుస్తారు. ఉత్తర అమెరికా, ఉత్తర ఐరోపాల్లోని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది...

మీకు తెలుసా బాతు

నల్లని మక్కు, పసుపు పచ్చని కళ్లు, మెడపైన కింద భాగంలో పచ్చ, నలుపు రంగు, రెక్కలు ఎరుపు, తెలుపు ఉంటాయి. ఈ బాతును ‘నార్తర్న్‌ షావలర్‌’ అని పిలుస్తారు.

బ్రిటన్‌లో పారా అని పిలుస్తారు. ఉత్తర అమెరికా, ఉత్తర ఐరోపాల్లోని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మన దేశంతో పాటు కరేబియన్‌ దీవులు, దక్షిణ అమెరికా, ఆస్ర్టేలియాలో కూడా ఇవి కనిపిస్తాయి.

1758లో స్వీడిస్‌ పక్షి ప్రేమికుడు ఈ పక్షి గురించి మొదటి సారి ప్రస్తావించాడు.

మగ పక్షులు మాత్రమే అందంగా ఉంటాయి. ఆడ పక్షులు నలుపు, బూడిద రంగుల్లో ఉంటాయి.

వీటి పొడవు 48 సెం.మీ. వింగ్‌ స్పాన్‌ 78 సెం.మీ ఉంటుంది.

పచ్చికమైదానాల్లో అది కూడా నీళ్లు ఉండే ప్రాంతంలో మాత్రమే గుడ్లు పెడతాయి. ఇవి తొమ్మిది నుంచి పదకొండు గుడ్లు వరకూ మాత్రమే పెడతాయి. వీటి పొదిగే సమయం ఇరవై నాలుగు రోజులు. పొదిగే సమయంలో అగ్రెసివ్‌గా ఉంటాయి. మగ పక్షులను కూడా దగ్గరకు రానివ్వవు.

9.jpg

ఇరవై శాతం పక్షులు యూర్‌పలోనే ఉంటాయి. ఈ షావలర్స్‌ విస్తృతంగా తిరుగుతాయి. ఎలా అంటే.. అమెరికాలో ఉత్తర రాష్ర్టాల్లో చలిగా ఉంటే దక్షిణానికి వెళ్తాయి. అలా యూర్‌పనుంచి మెక్సికో పక్కకు కూడా వెళ్తాయి. ఇక హిమాలయాల మీద మన దేశానికి వస్తాయి. జపాన్‌కూ వెళ్తాయి. ఎక్కడ వాతావరణం అనువుగా ఉంటే అక్కడకు వలస పోతాయి.

సముద్రతీర ప్రాంతాల్లో, సరస్సుల దగ్గర గుంపులుగా ఉంటాయి. నీటిలో ఉండే చిన్న పురుగులు, పాచిలాంటి పదార్థాలను తిని బతుకుతాయి.

ఆడపక్షులు క్వాక్‌ క్వాక్‌.. అని అరిస్తే మగపక్షులు మాత్రం ‘టుక్‌ టుక్‌..’ అని అరుస్తాయి. కేజీ కంటే బరువు ఉండవు. సులువుగా గాల్లో ఎగురుతాయి. ఈ పక్షి ముక్కు గట్టిగా ఉంటుంది.

Updated Date - 2023-09-25T23:43:54+05:30 IST