Diamond : ..అందుకే వజ్రం
ABN , First Publish Date - 2023-06-07T06:02:17+05:30 IST
వజ్రం.. ఒక అరుదైన రాయి.. అందుకే దానికంత విలువ. మనం ఈ అరుదైన రాళ్లతో కొన్ని వందల ఏళ్లుగా ఆభరణాలను తయారు చేస్తున్నాం. ఇటీవల ఈ వజ్రాలతో చేసిన ఆభరణాలతో– శివ నారాయణ్ జ్యూయెలర్స్–
వజ్రం.. ఒక అరుదైన రాయి.. అందుకే దానికంత విలువ. మనం ఈ అరుదైన రాళ్లతో కొన్ని వందల ఏళ్లుగా ఆభరణాలను తయారు చేస్తున్నాం. ఇటీవల ఈ వజ్రాలతో చేసిన ఆభరణాలతో– శివ నారాయణ్ జ్యూయెలర్స్– ఎనిమిది గిన్నిస్ రికార్డులను సాధించింది. ఈ నేపథ్యంలో– అసలు వజ్రాలను ఎలా ఎంచుకోవాలనే విషయాన్ని శివ నారాయణ్ జ్యూయెలర్స్ ఎండీ తుషార్ అగర్వాల్ ప్రతినిధి ‘నవ్య’కు వెల్లడించారు.

గణేష్ లాకెట్ (1011.150 గ్రాములు)
లాకెట్‌లో పొదిగిన వజ్రాల సంఖ్య 11,472
రామ్ దర్బార్ లాకెట్ (1681.820 గ్రాములు)
ఎన్ని రకాలు?
వజ్రాలు అనేక రకాలు. వీటిలో కట్, అన్‌కట్ అనే రెండు రకాలు ఉంటాయి. కట్ డైమండ్స్ కన్నా అన్‌కట్ డైమండ్స్ ఖరీదు తక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అన్‌కట్ డైమండ్స్ కూడా మంచి మార్కెట్ ఉంది. అనేక మంది అన్‌కట్ డైమండ్స్‌తో ఆభరణాలు చేయించుకుంటున్నారు. ఇక డైమండ్స్ రంగు విషయానికి వస్తే– వజ్రాలు పింక్, ఎల్లో, బ్లూ రంగుల్లో కూడా లభిస్తాయి. అయితే ఇవి అరుదుగా లభిస్తాయి. అందువల్ల వీటి ఖరీదు ఎక్కువగా ఉంటుంది.
ఎలా ఎంపిక చేసుకోవాలి?
ఒకప్పుడు వజ్రాలకు సర్టిఫికేట్లు ఉండేవి కావు. కానీ ఈ మధ్యకాలంలో అందరూ సర్టిఫికేట్స్‌ను అందిస్తున్నారు. ఈ సర్టిఫికేట్ వల్ల మనకు డైమండ్ రంగు, రూపులతో పాటుగా అది ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం కూడా తెలుస్తుంది. ఇలా డైమండ్ సర్టిఫికేట్స్‌ను అందించే ల్యాబ్‌లు అనేకం ఉన్నాయి. ల్యాబ్ సర్టిఫికేట్ లేకుండా వజ్రాలను కొనుగోలు చేయటం మంచిది కాదు.
కొత్త డిజైన్స్..
ఒకప్పుడు వజ్రాలను కేవలం నెక్లస్‌లకు మాత్రమే వాడేవారు. ఈ మధ్యకాలంలో పెండెంట్‌లకు కూడా ఎక్కువగా వాడుతున్నారు. వీటితో పాటుగా అన్‌కట్ డైమండ్స్‌తో అనేక రకాల నెక్లస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే– ఎక్కువ మంది వజ్రాలు, ఎమరాల్డ్స్‌తో కలిపి నెక్లెస్‌లు, గొలుసులు చేయించుకుంటున్నారు. ఒకప్పుడు పూర్తిగా వజ్రాలతో మాత్రమే ఆభరణాలు చేయించుకొనేవారు. ప్రస్తుతం ఆ ట్రెండ్ తగ్గిపోయింది.
ఎవరికి ఏం నప్పుతాయి?
వజ్రాలు ఖరీదు ఎక్కువ. అందువల్ల అనేక రకాల అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆభరణాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ ఆకృతి, మెడ పొడవులను ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాలి.