Shorts : షార్ట్స్‌ షోకులు

ABN , First Publish Date - 2023-08-02T04:46:47+05:30 IST

కొన్నేళ్ల కిత్రం అమ్మాయిలు షార్ట్స్‌ వేసుకోడానికి వెనకాడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నిస్సంకోచంగా షార్ట్స్‌ వేసుకునే సంస్కృతి సర్వత్రా పెరిగిపోయింది.

 Shorts : షార్ట్స్‌ షోకులు

కొన్నేళ్ల కిత్రం అమ్మాయిలు షార్ట్స్‌ వేసుకోడానికి

వెనకాడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా

నిస్సంకోచంగా షార్ట్స్‌ వేసుకునే సంస్కృతి సర్వత్రా పెరిగిపోయింది. అయితే షార్ట్స్‌లో మరింత ఎట్రాక్టివ్‌గా కనిపించడం కోసం కొన్ని టిప్స్‌ పాటించాలి.

ఎత్తు, బాడీ టైప్‌

షార్ట్స్‌ను ఎంచుకునేటప్పుడు ఎత్తు, బాడీ టైప్‌లను దృష్టిలో పెట్టుకోవాలి. వేర్వేరు పొడవులతో కూడిన ఎలాంటి షార్ట్‌ అయినా ధరించవచ్చు. కానీ నప్పేలా కనిపించాలంటే సూటయ్యే లెంగ్త్‌ ఉన్న షార్ట్‌నే ఎంచుకోవాలి. కురచగా ఉండే అమ్మాయిలు షార్ట్‌లో మరీ కురచగా కనిపించే ప్రమాదం ఉంది కాబట్టి పొట్టిగా ఉండే షార్ట్‌నే ఎంచుకోవాలి. పొడవైన అమ్మాయిలు బెర్ముడా షార్ట్స్‌ను ఎంచుకుంటే బాగుంటుంది.

రియర్‌ వ్యూ కూడా ముఖ్యమే!

జీన్స్‌లాగే షార్ట్స్‌ వెనక భాగం కూడా చూడముచ్చటగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం జేబులు ఉన్న ప్రదేశాన్ని గమనించాలి. అలాగే షార్ట్స్‌ వెనక వైపున కిందకు జారిపోయినట్టు కాకుండా, పిరుదులను అంటిపెట్టుకుని ఉండేలా చూసుకోవాలి. అలాగే షార్ట్‌ మరీ బిగుతుగా కూడా ఉండకూడదు. బిగుతుగా ఉంటే, సైడ్‌ పాకెట్స్‌ బయటకు పొడుచుకు వస్తాయి.

నాణ్యమైనవే మేలు

షార్ట్స్‌ నాణ్యత మీద దృష్టి పెట్టాలి. ఒక్క ఉతుకుకే సాగిపోయేవైతే, ఒక్కసారి ధరించడానికే పనికొస్తాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి. మందపాటి కాటన్‌, జీన్స్‌, స్పన్‌ మెటీరియల్‌ షార్ట్స్‌ ఎక్కువ కాలం మన్నుతాయి.

Updated Date - 2023-08-02T04:46:47+05:30 IST