Fashion : షార్ట్ కుర్తా షోకులు
ABN , First Publish Date - 2023-05-02T23:26:38+05:30 IST
పొడవాటి కుర్తా ఫ్యాషన్‌ను షార్ట్ కుర్తాలు ఆక్రమిస్తున్నాయి. సౌకర్యానికీ, స్టైల్‌కీ పర్యాయపదంలా ఉండే ఈ షార్ట్ కుర్తాలను ..
పొడవాటి కుర్తా ఫ్యాషన్‌ను షార్ట్ కుర్తాలు ఆక్రమిస్తున్నాయి. సౌకర్యానికీ, స్టైల్‌కీ పర్యాయపదంలా ఉండే ఈ షార్ట్ కుర్తాలను సరైన బాటమ్స్‌తో జోడిస్తే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా వెలిగిపోవచ్చు.
జీన్స్, లెగ్గింగ్స్, జెగ్గింగ్స్ ధరించినప్పుడు సౌకర్యంగా ఉండే షార్ట్ కుర్తాలు ధరించవచ్చు.
కాటన్, సింథటిక్ మెటీరియల్స్‌లో దొరికే ఈ చిట్టిపొట్టి కుర్తాలు స్టైలిష్ లుక్ తెచ్చిపెట్టడంతో పాటు, మోడర్న్‌గానూ కనిపిస్తాయి!
సౌకర్యానికి పెద్ద పీట వేసే షార్ట్ కుర్తాలను లాంగ్ స్కర్ట్‌తో కలిపి ధరించవచ్చు.
ఈవినింగ్ పార్టీలు, ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్స్‌కు షార్ట్ కుర్తాలు స్టైలి్‌షగా ఉంటాయి.
సింపుల్‌గా, హుందాగా కనిపించాలనుకునేవాళ్లు షార్ట్ కుర్తాలను ఎంచుకోవచ్చు.
లతలు, పువ్వుల డిజైన్లు ఉన్న షార్ట్ కుర్తాలు యాంకిల్ లెంగ్త్ జీన్స్ మీదకు సూటవుతాయి. పెన్సిల్ హీల్స్‌ను ఈ డ్రస్‌కు మ్యాచ్ చేస్తే చూడముచ్చటగా కనిపించవచ్చు.
చికన్ వర్క్ కుర్తాల్లో షార్ట్ లెంగ్త్ కూడా ఉంటాయి. ఇవి కాలేజీ అమ్మాయిలకు చక్కగా సూటవుతాయి. సినిమాలు, షికార్లకు ఈ రకం కుర్తాలు అనువైన స్టైల్!
షార్ట్ కుర్తా ఫుల్ హ్యాండ్స్ వేసినా, షార్ట్ హ్యాండ్ ఉన్నా, స్లీవ్‌లెస్ అయినా.... ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది. కాబట్టి సందర్భాన్ని బట్టి అనువైన కుర్తా ఎంచుకోవాలి!
యాక్సెసరీస్ ఇలా...
యాంటిక్ జ్యువెలరీ, ఉడెన్ లేదా టెర్రకోటా జ్యువెలరీ ఈ తరహా దుస్తులకు నప్పుతాయి.
స్లింగ్ బ్యాగ్ చక్కగా మ్యాచ్ అవుతుంది.
హై హీల్స్, ఫ్లాట్స్.. రెండు రకాల ఫుట్ వేర్ వేసుకోవచ్చు.
భారీ నెక్లెస్‌లూ, కడాలూ లాంటివి ధరించకపోవడమే మేలు.