Blood test : రక్తపరీక్ష రహస్యాలు
ABN , First Publish Date - 2023-07-24T23:19:21+05:30 IST
రుగ్మతలను కనిపెట్టే సులువైన పరీక్ష బ్లడ్ టెస్ట్. ఈ పరీక్షల ఫలితాల్లో కనిపించే హెచ్చుతగ్గులు శరీరంలో దాగిన అస్వస్థతలకు అద్దం పడతాయి. ఆ ఫలితాల సూచనలు ఏవంటే...
రుగ్మతలను కనిపెట్టే సులువైన పరీక్ష బ్లడ్ టెస్ట్. ఈ పరీక్షల ఫలితాల్లో కనిపించే హెచ్చుతగ్గులు శరీరంలో దాగిన అస్వస్థతలకు అద్దం పడతాయి. ఆ ఫలితాల సూచనలు ఏవంటే...
టోటల్ ప్రొటీన్ (టిపి)
పెరిగితే: డీహైడ్రేషన్, ఇన్‌ఫ్లమేషన్
తరిగితే: రక్తస్రావం, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, జీర్ణకోశ వ్యాధి, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఎఎల్‌బి (ఆల్బ్యుమిన్)
పెరిగితే: డీహైడ్రేషన్
తరిగితే: రక్తస్రావం, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, జీర్ణకోశ వ్యాధి, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ బ్లడ్ యూరియా నైట్రోజన్ (బియుఎన్)
పెరిగితే: మూత్రపిండాల వ్యాధి, డీహైడ్రేషన్, మూత్ర విసర్జనలో అడ్డంకి, గుండెజబ్బు, షాక్, అధిక మాంసకృత్తులతో కూడిన ఆహారం
తరిగితే: కాలేయ వ్యాధి, ఆహారంలో మాంసకృత్తుల లోపం గ్లోబ్యులిన్ (జిఎల్‌ఒబి)
పెరిగితే: తీవ్ర ఇన్‌ఫ్లమేషన్, తీవ్ర ఇన్‌ఫెక్షన్
తరిగితే: రక్తస్రావం, జీర్ణకోశ వ్యాధి, వ్యాధినిరోధక శక్తి లోపం క్రియాటినిన్ (సిఆర్‌ఈటి)
పెరిగితే: మూత్రపిండాల వ్యాధి, డీహైడ్రేషన్, కండర నష్టం, మూత్రంలో అడ్డంకి
తరిగితే: ఓవర్ హైడ్రేషన్ గ్లూకోజ్ (జిఎల్‌యు)
పెరిగితే: డయాబెటిస్ మెల్లిటస్
తరిగితే: సెప్సిస్, పోషకాహార లోపం, నాడీ సంబంధ వ్యాధి కొలెస్ట్రాల్ (సిహెచ్‌ఔల్)
పెరిగితే: డయాబెటిస్ మెల్లిటస్, హైపోథైరాయిడిజం, పాంక్రియటైటిస్, మూత్రపిండాల వ్యాధి
తరిగితే: పేగుల వ్యాధులు, కాలేయ పనితీరు లోపం.