Second hand phone :సెకండ్ హ్యాండ్ ఫోన్ తస్మాత్ జాగ్రత్త!
ABN , First Publish Date - 2023-06-10T00:49:24+05:30 IST
బాగా పనిచేస్తుంటే స్మార్ట్ ఫోన్ సెకండ్ హ్యాండ్‌దైనా కొనుక్కోవడం తప్పుకాదు. అయితే దాని పనితీరు నుంచి ఎక్కడైనా తస్కరించినదా, మరేదైనా వంటి వ్యవహారాలు ముందుగా తెలుసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బాగా పనిచేస్తుంటే స్మార్ట్ ఫోన్ సెకండ్ హ్యాండ్‌దైనా కొనుక్కోవడం తప్పుకాదు. అయితే దాని పనితీరు నుంచి ఎక్కడైనా తస్కరించినదా, మరేదైనా వంటి వ్యవహారాలు ముందుగా తెలుసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వ్యవహారాలను సులువుగా తెలుసుకునేందుకుగాను కేంద్ర టెలికాం విభాగం ప్రత్యేకించి ‘సంచార్ సాతీ’ పోర్టల్‌ను ఆరంభించింది. బ్లాకింగ్, ట్రాకింగ్, వెరిఫికేషన్ కోసం ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఈ పోర్టల్‌లో మొదటిది సెంట్రల్ ఎక్వి్‌పమెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్). ఇందులోకి వెళ్ళి సదరు ప్రక్రియలు అన్నింటినీ పూర్తి చేస్తే చాలు, చట్టబద్ధ సంస్థలు వెంటనే చర్య తీసుకుంటాయి.
పోగొట్టుకున్న డివైజ్‌ను బ్లాక్ చేస్తాయి. నో యువర్ మొబైల్ ఫీచర్‌తో సెకండ్ హ్యాండ్ మొబైల్‌కు సంబంధించిన వివరాలను పూర్తిగా పొందవచ్చు.
సైబర్ ఫ్రాడ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో మోసాల కోసం ఉపయోగిస్తున్న 36 లక్షల ఫోన్లను పూర్తిగా తొలగించామని, వాట్సాప్ అకౌంట్లను కూడా బ్లాక్ చేయించామని సాక్షాత్తు సంబంధిత కేంద్ర మంత్రి వెల్లడించడం గమనార్హం. ఈ పోర్టల్‌లో టాఫ్కో ఫెసిలిటీ కూడా ఉంది. అనుమతి లేకుండా తమ పేర్లతో ఉన్న ఫోన్ నంబర్లను దీంతో తెలుసుకోవచ్చు. సీడాట్ కూడా ఈ పోర్టల్ సహాయంతో నిర్దేశిత ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులను నిర్వహించి రెండున్నర వేల ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఓనర్లకు అందజేసింది.