రూ. 100 కోట్లతో 50వ చిత్రం

ABN , First Publish Date - 2023-05-28T04:37:14+05:30 IST

దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ధనుష్‌. రొటీన్‌ తరహా హీరోయిజం హద్దుల్లో బందీ అవకుండా దీటైన నటనతో

రూ. 100 కోట్లతో 50వ చిత్రం

క్షిణాది ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ధనుష్‌. రొటీన్‌ తరహా హీరోయిజం హద్దుల్లో బందీ అవకుండా దీటైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఆయనకు కొత్త కాదు. ఇటీవలె విడుదలైన ‘సార్‌’ చిత్రం మరోసారి నటుడిగా పేరుతో పాటు మంచి వసూళ్లను తె చ్చింది. ధనుష్‌ ప్రస్తుతం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అనే చిత్రం చేస్తున్నారు. చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రం పూర్తవగానే ఆయన హీరోగా 50వ సినిమా ప్రారంభం అవనుంది. ‘డీ 50’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. ఈ చిత్రానికి ధ నుష్‌ దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. సన్‌ పిక్చర్స్‌ సంస్థ రూ. 100 కోట్లతో భారీగా నిర్మించనుందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన రాలేదు కానీ క్రేజీ కాంబినేషన్‌లో ఈ చిత్రం ఉండబోతోందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎస్‌ జే సూర్యతో పాటు టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ఈ చిత్రంలో నటిస్తున్నారనీ, చెన్నైకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్‌ కథతో ఈ చిత్రం తెరకెక్కనుందని మీడియా వర్గాల సమాచారం. ఈ ఏడాది చివరలో ‘డీ 50’ సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘రాయన్‌’ అనే టైటిల్‌ ఈ సినిమాకు ఫిక్స్‌ అయినట్లు చెబుతున్నారు.


Updated Date - 2023-05-28T04:37:14+05:30 IST