emoji : ఈమెయిల్‌కు ఎమోజీతో రిప్లయ్
ABN , First Publish Date - 2023-09-16T04:54:48+05:30 IST
ఈమెయిల్‌కు స్పందనగా ఎమోజీని పంపుకొనేందుకు వీలుగా జీమెయిల్ చర్యలు తీసుకుంటోంది. హిడెన్ కోడ్ వెల్లడించిన విషయం ప్రకారం జీమెయిల్ ఇన్‌బాక్స్‌కు వచ్చే మెయిల్స్‌కు స్పందనగా ఎమోజీలు పంపుకోవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో ఈ ఫీచర్‌ని తీసుకువచ్చే పని
ఈమెయిల్‌కు స్పందనగా ఎమోజీని పంపుకొనేందుకు వీలుగా జీమెయిల్ చర్యలు తీసుకుంటోంది. హిడెన్ కోడ్ వెల్లడించిన విషయం ప్రకారం జీమెయిల్ ఇన్‌బాక్స్‌కు వచ్చే మెయిల్స్‌కు స్పందనగా ఎమోజీలు పంపుకోవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో ఈ ఫీచర్‌ని తీసుకువచ్చే పని జరుగుతోంది. అందరికీ అందుబాటులోకి తేవడానికి ముందు బేటాలో రిలీజ్ చేసి, ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులో ఉంచనుందని సమాచారం. అలాగే ఈ ఫీచర్ విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. బీసీసీ ద్వారా అందే ఈమెయిల్స్‌కు ఈ ఫీచర్ సపోర్ట్ చేయదు. జీమెయిల్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లకూ వర్తించదు. పెద్ద గ్రూపులతో ఉండే ఈమెయిల్ థ్రెడ్స్‌లోనూ పనిచేయదు. సింగిల్ ఎమోజీ స్పందనను యూజర్ ఎంత కాలం ఉపయోగించుకోవచ్చనే విషయంలోనే ఏమీ నిర్ధారించలేదు. పూర్తి వివరాలను వెల్లడించలేదు. మైక్రోసాఫ్ట్ ‘ఔట్‌లుక్’ సహా ఇతర ఈమెయిల్ సర్వీసులు ఈ సదుపాయాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాయి.