Pitron: పిట్రాన్‌ ఫోర్స్‌ స్మార్ట్‌ వాచీ

ABN , First Publish Date - 2023-02-24T23:25:32+05:30 IST

పిట్రాన్‌ - ఫోర్స్‌ స్మార్ట్‌ వాచీ సిరీస్‌లో మరో వేరబుల్‌ని ప్రకటించింది. ఎక్స్‌12ఎన్‌ పేరిట విడుదలవుతున్న వాచీకి ప్రి-ఇన్‌స్టాల్డ్‌ ఫేసెస్‌, బిల్ట్‌-ఇన్‌ గేమ్స్‌, ఫుల్‌ టచ్‌ 12.5డి కర్వ్‌డ్‌ గ్లాస్‌, ఫంక్షనల్‌ క్రౌన్‌ ఉన్నాయి.

 Pitron: పిట్రాన్‌ ఫోర్స్‌ స్మార్ట్‌ వాచీ

పిట్రాన్‌ - ఫోర్స్‌ స్మార్ట్‌ వాచీ సిరీస్‌లో మరో వేరబుల్‌ని ప్రకటించింది. ఎక్స్‌12ఎన్‌ పేరిట విడుదలవుతున్న వాచీకి ప్రి-ఇన్‌స్టాల్డ్‌ ఫేసెస్‌, బిల్ట్‌-ఇన్‌ గేమ్స్‌, ఫుల్‌ టచ్‌ 12.5డి కర్వ్‌డ్‌ గ్లాస్‌, ఫంక్షనల్‌ క్రౌన్‌ ఉన్నాయి. హెల్త్‌, ఫిట్‌నెస్‌ ఫీచర్ల విషయానికి వస్తే ఎస్‌పిఒ2, హార్ట్‌ రేట్‌ మానిటర్‌, స్లీప్‌ ట్రాకింగ్‌, డైలీ యాక్టివిటీ ట్రాకర్‌ తదితరాలు కూడా ఉన్నాయి. 1.85 ఇంచీల హెచ్‌డి డిస్‌ప్లేకి తోడు 130కి మించి ప్రీ ఇన్‌స్టాల్డ్‌ ఫేసెస్‌తో వస్తోంది. మల్టిపుల్‌ స్పోర్ట్స్‌ మోడ్‌తోపాటు అయిదు రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. బ్లూటూత్‌ 5.0 కనెక్టివిటీ ఉంది. ఇన్‌కమింగ్‌ కాల్‌, సోషల్‌ మీడియా, టెక్స్ట్‌ మెసేజ్‌ అలర్ట్స్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌, కెమెరా కంట్రోల్‌ కూడా ఉన్నాయి. దీని రేటు రూ.1,199 కాగా అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు.

Updated Date - 2023-02-24T23:25:32+05:30 IST