Titles : పవన్‌.. మహేశ్‌.. టైటిళ్లు ఇవేనా..?!

ABN , First Publish Date - 2023-03-26T01:22:55+05:30 IST

టాలీవుడ్‌లో కొత్త టైటిళ్లు కాస్త గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్‌ హీరోల చిత్రాలకు సంబంధించిన ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఫలానా హీరో సినిమాకి ఏ టైటిల్‌ పెట్టారు? అంటూ చర్చించుకొంటున్నారు.

Titles : పవన్‌.. మహేశ్‌.. టైటిళ్లు ఇవేనా..?!

టాలీవుడ్‌లో కొత్త టైటిళ్లు కాస్త గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్‌ హీరోల చిత్రాలకు సంబంధించిన ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఫలానా హీరో సినిమాకి ఏ టైటిల్‌ పెట్టారు? అంటూ చర్చించుకొంటున్నారు. ఆ క్రమంలో కొత్త టైటిళ్లు బయటకు వస్తున్నాయి. మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ ఏమిటన్నది ఇంకా తెలీలేదు. ఉగాది సందర్భంగా టైటిల్‌ ప్రకటిస్తారని అనుకొన్నారు కానీ, ఆ హడావుడేం కనిపించలేదు. త్రివిక్రమ్‌కి ‘అ’ సెంటిమెంట్‌ ఎక్కువ. అందుకే ‘అయోధ్యలో అర్జునుడు’, ‘అమ్మకథ’ లాంటి పేర్లు బయటకు వచ్చాయి. కానీ.. చిత్రబృందం వీటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ‘అమరావతికి అటూ.. ఇటూ’ అనే టైటిల్‌ పెట్టారంటూ ప్రచారం మొదలైంది. ఈ పేరు ఈ చిత్రానికి ఫిక్స్‌ చేశారని, శ్రీరామనవమిన అధికారికంగా ప్రకటిస్తారని టాక్‌.

మరోవైపు పవన్‌ కల్యాణ్‌ చిత్రానికీ ఓ కొత్త టైటిల్‌ బయటకు వచ్చింది. పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకులుగా సముద్రఖని దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ‘గోపాల గోపాల’ తరహా కథ ఇది. ఇందులో పవన్‌ దేవుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్టు టాక్‌. జులై 28న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇస్తామని చిత్రబృందం చెబుతోంది.

Updated Date - 2023-03-26T01:22:55+05:30 IST