Iphone screen damage ; స్ర్కీన్‌ పగిలినా ఇబ్బందిలేదు

ABN , First Publish Date - 2023-07-21T23:32:26+05:30 IST

ఐఫోన్‌పై ఓలెడ్‌ స్ర్కీన్‌ పాడైతే మార్చుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. లేజర్‌ టెక్నాలజీతో రిపెయిర్‌ చేసుకోవచ్చు. యూట్యూబర్‌ స్పేర్‌ పార్ట్స్‌ ఈ మేరకు వీడియోను విడుదల చేసింది. 2017 నుంచి ఓలెడ్‌ స్ర్కీన్‌ను ఐఫోన్‌ ఉపయోగిస్తోంది. ఓలెడ్‌ స్ర్కీన్‌ దెబ్బతింటే తొలగించాల్సిన అవసరం

Iphone screen damage ; స్ర్కీన్‌ పగిలినా ఇబ్బందిలేదు

‘లేజర్‌’తో రిపేర్‌ చేయొచ్చు

ఐఫోన్‌పై ఓలెడ్‌ స్ర్కీన్‌ పాడైతే మార్చుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. లేజర్‌ టెక్నాలజీతో రిపెయిర్‌ చేసుకోవచ్చు. యూట్యూబర్‌ స్పేర్‌ పార్ట్స్‌ ఈ మేరకు వీడియోను విడుదల చేసింది. 2017 నుంచి ఓలెడ్‌ స్ర్కీన్‌ను ఐఫోన్‌ ఉపయోగిస్తోంది. ఓలెడ్‌ స్ర్కీన్‌ దెబ్బతింటే తొలగించాల్సిన అవసరం లేదని, లేజర్‌ టెక్నాలజీతో మరమ్మతు చేసుకోవచ్చని ఆ వీడియో ద్వారా తెలిసింది. ఇది ఫస్ట్‌ జనరేషన్‌ మెషీన్‌. దీన్ని మరింత మెరుగుపర్చాల్సి ఉందని ఆ మెషీన్‌ను రూపొందించిన వారు చెబుతున్నారు. స్ర్కీన్‌ పగిలితే, లైన్లు ఏర్పడతాయి. వాటిని ఫిక్స్‌ చేయాల్సి ఉంటుంది. క్లిష్టత అంతా ఆ పొరల్లో ఇమిడి ఉంటుంది. రిపెయిర్‌కు సమయం పడుతుంది. అయితే లేజర్‌ సాంకేతికతతో ఆ లైన్లు మటుమాయం అవుతాయని చెబుతున్నారు. ఈ మెషీన్‌ ధర 12000 డాలర్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.

Updated Date - 2023-07-21T23:32:47+05:30 IST