Noise Watch : నాయిస్ కొత్త వాచీ కలర్‌ఫిట్ ఐకాన్ 3
ABN , First Publish Date - 2023-04-07T23:19:14+05:30 IST
నాయిస్ మన మార్కెట్‌లోకి లేటెస్ట్ స్మార్ట్ వాచీ ‘కలర్‌ఫిట్ ఐకాన్ 3’ని తీసుకు వచ్చింది. వంద స్పోర్ట్స్ మోడ్స్‌కు తోడు పలు ఇతర ఫీచర్లు
నాయిస్ మన మార్కెట్‌లోకి లేటెస్ట్ స్మార్ట్ వాచీ ‘కలర్‌ఫిట్ ఐకాన్ 3’ని తీసుకు వచ్చింది. వంద స్పోర్ట్స్ మోడ్స్‌కు తోడు పలు ఇతర ఫీచర్లు కూడా ఈ వాచీలో ఉన్నాయి. మెటాలిక్ ఫినిషింగ్, డిస్‌ప్లే పై బీజెల్స్(చుట్టూ ఎడ్జ్ పారదర్శక కవరింగ్‌తో) ఉంటుంది. పెద్ద సంఖ్యలో హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. 1.9ఇంచీల డిస్‌ప్లే ఉంది. 246 ్ఠ 296 పిక్సెల్స్, 500 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. బిల్ట్ ఇన్ మైక్రోఫోన్, నంబర్స్ డయల్ చేసే సౌలభ్యం కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ లేకుండా కాల్స్ కూడా చేసుకోవచ్చు. క్యూఆర్ స్కానింగ్ సదుపాయం కూడా ఉంది. ఆరు రంగుల్లో - మట్టె గోల్డ్, రోజ్ మౌవె, స్పేస్ బ్లూ, మిడ్‌నైట్ గోల్డ్, కామ్ బ్లూ, జెట్ బ్లాక్‌తో ఈ వాచీ లభిస్తోంది. దీని ధర రూ.1999 కాగా ఫ్లిఫ్‌కార్ట్ లేదా నాయిస్ వెబ్‌సైట్ నుంచి కూడా పొందచ్చు.