National Youth Day: వాగ్దాటికి ముగ్దులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది.

ABN , First Publish Date - 2023-01-12T12:01:12+05:30 IST

ఆ బోధలు ఎప్పుడూ యువతకు స్పూర్తినిచ్చాయి.

National Youth Day: వాగ్దాటికి ముగ్దులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది.
National Youth Day

భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచం అంతా చాటిన స్వామీ వివేకానంద జనవరి 12న జన్మించారు. ఈ పర్వదినాన్ని భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామీ వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రాములలో సమాజంలో అత్యంత ప్రభావాన్ని కలిగించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు వివేకానందుడు. ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్పూర్తినిచ్చాయి. ఇప్పటికీ వారిలో చైతన్యాన్ని నింపుతున్నాయి.

హిందూ తత్వచరిత్ర, భారతదేశ చరిత్రలతోనే భారతదేశాన్ని జాగృతి చేయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్ వంటి విదేశాలలో కూడా ఆయన ప్రసంగించాడు. ఉపన్యాసాలు ఇచ్చి వాదనలు ద్వారా పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి వివేకానందుడు. అతని వాగ్దాటికి ముగ్దులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు.

స్వామి వివేకానంద 125 ఏళ్ళ క్రితం చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో ఆయన చేసిన అనితరసాధ్యమైన ప్రసంగం గుర్తుకు తెచ్చుకుంటే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తాయి. ముందుగా రాసుకుని సిద్ధంగా ఉంచుకున్న ప్రసంగం కాదు అది. "అమెరికా దేశపు ప్రియమైన సహోదరులారా" అంటూ స్వామి ప్రసంగం మొదలుపెట్టినపుడు మూడు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో మహాసభ మారుమ్రోగిపోయింది. ఆంగ్లభాషలో స్వామి వివేకానందుని ప్రసంగానికి అమెరికా ప్రజానికం నీరాజనాలు పట్టింది. అంత గొప్ప ఉపన్యాసకుడైన స్వామి వివేకానందుడు ఎన్నోవ్యయప్రయాసలకోర్చి అమెరికా చేరుకున్నారు.

చికాగోలో ఆయన తొలి ప్రసంగం కూడా ఈరోజుకు కూడా ప్రపంచం అంతా గురుతుచేసుకునేదిగానే నిలిచి ఉంది. అదో అద్భుత సంఘటన. చికాగోలో సర్వమత సమ్మేళనానికి వేలాది మంది ప్రతినిధులు తరలివచ్చారు. అక్కడ భారతదేశం తరపున హాజరైన వారిలో స్వామి వివేకానంద ఒక్కరే పిన్న వయస్కుడు కావడం మరో విశేషం.

రామకృష్ణ పరమహంస ఎక్కడా సొంత మతాన్ని ప్రకటించలేదు. అదే సిద్దాంతాన్ని వివేకానందుడు అనుసరించాడు. తన బోధలతోనే యువతలో చైతన్యాన్ని నింపాడు. ఇనుప నరాలు, ఉక్కు కండరాలున్న వందమంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను అన్న మహా ద్రష్ట. ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతరం చేతుల్లోనే ఉన్నదని నూరేళ్ళకు పూర్వమే చాటిన దార్శనికత స్వామి వివేకానందునిది.

Updated Date - 2023-01-12T12:53:44+05:30 IST