National Hugging Day 2023: ఈరోజు నేషనల్ హగ్గింగ్ డేట..
ABN , First Publish Date - 2023-01-21T13:53:50+05:30 IST
కౌగిలింతలు వల్ల ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి
ప్రతి సంవత్సరం జనవరి 21ని నేషనల్ హగ్గింగ్ డేగా జరుపుకుంటారు. కౌగిలించుకోవడం వల్ల మనుషుల మధ్య పెరిగే దూరం దగ్గరవుతుందని నమ్ముతారు. ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ప్రియమైన వారి పట్ల ప్రేమ, ఆప్యాయతలను చూపించడానికి ఈ రోజును జరుపుకుంటారట. ఈ రోజు కౌగిలింతల ద్వారా ఆప్యాయత తెలియజేస్తారు. కౌగిలింతలు వల్ల ఒత్తిడి,ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి అలాగే ప్రేమ, ఆప్యాయత వంటి భావాలను సృష్టిస్తాయి.
జాతీయ హగ్గింగ్ డే: 2023
నేషనల్ హగ్గింగ్ డేని 1986 సంవత్సరంలో 'కెవిన్ జాబోర్నీ'(Kevin Zaborni) ప్రారంభించారు. దీనిని జనవరి 21న జరుపుకుంటారు. "హగ్" అనే పదం పాత నార్స్ భాషలో "ఓదార్పు" అనే అర్థం వచ్చే "హగ్గా" అనే పదం నుండి వచ్చిందని నమ్ముతారు, ఇది మొదట సుమారు 450 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇలాంటి కార్యక్రమం ప్రజలలో ఎలాంటి సందేహం లేకుండా ఆప్యాయంగా ఉండేలా ప్రోత్సహిస్తుందని ఆయన భావించారు. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని క్లియో నగరంలో తొలిసారిగా ఈ రోజుని జరుపుకున్నారు. కెవిన్ జాబోర్నీ అమెరికన్ సమాజం "బహిరంగంలో భావోద్వేగాలను ప్రదర్శించడానికి సిగ్గుపడుతోంది" అని గమనించాడు, అందువల్ల జాతీయ హగ్గింగ్ డే ప్రజలలో మరింత ప్రేమను తీసుకురావడంలో సహకరిస్తుందని భావించాడు.
కౌగిలించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. ఆందోళనను తగ్గించడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు
2. కౌగిలించుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
3. కౌగిలించుకోవడం వల్ల కూడా ఒత్తిడి, రక్తపోటు తగ్గుతాయి.
4. కౌగిలింత నాడీ వ్యవస్థపై ఎంతో ప్రభావం చూపుతుందట.
5. ఏదైనా చెప్పే బదులు, కౌగిలింత మంచి మార్గంలో చాలా విషయాలను తెలియజేస్తుందట..