Fashion : చిటపట చినుకుల్లో...

ABN , First Publish Date - 2023-07-12T00:46:21+05:30 IST

అడపా దడపా చిరుజల్లులు, జోరు వానలు కురిసే వర్షాకాలంలో నేల మీద జీరాడే దుస్తులకు బదులుగా చిట్టిపొట్టిగా ఉండే ముచ్చటైన దుస్తులనే ఎంచుకోవాలి. అలాంటి మాన్‌సూన్‌ ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ ఇవే!

Fashion : చిటపట చినుకుల్లో...

అడపా దడపా చిరుజల్లులు, జోరు వానలు కురిసే వర్షాకాలంలో నేల మీద జీరాడే దుస్తులకు బదులుగా చిట్టిపొట్టిగా ఉండే ముచ్చటైన దుస్తులనే ఎంచుకోవాలి. అలాంటి మాన్‌సూన్‌ ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ ఇవే!

కలర్‌ఫుల్‌: తెలుపు, లేత రంగులకు ఈ కాలంలో గుడ్‌ బై చెప్పేసి, వైబ్రెంట్‌గా కనిపించే రంగురంగుల దుస్తులు ఎంచుకోవాలి. తెల్ల దుస్తులు తడిచినప్పుడు పారదర్శకంగా మారిపోయి, ఇబ్బంది పెడతాయి కాబట్టి, నారింజ, పసుపు, ఎరుపు రంగులకు పెద్ద పీట వేయాలి.

కిమొనో: నేరుగా జపాన్‌ నుంచి మన మాన్‌సూన్‌ వార్డ్‌రోబ్‌లోకి చేరిపోయిన ఈ డ్రస్సుతో చిటికెలో రెడీ అయిపోవచ్చు. ఈ కిమొనో డ్రస్‌ను అలాగే ధరించవచ్చు. లేదంటే ఏదైనా ఔట్‌ఫిట్‌ మీద ష్రగ్‌లా కూడా ధరించవచ్చు.

కఫ్తాన్‌: ఈ కాలంలో కఫ్తాన్‌ ధరించకపోతే మిమ్మల్ని మీరు ఫ్యాషనిస్టాగా భావించడానికి వీల్లేదు. ఆకర్షణీయమైన రంగుల్లో, ప్రింట్లలో దొరికే కఫ్తాన్లు వానాకాలం ఫ్యాషన్‌. మోతిఫ్‌, ఫ్లోరల్‌, టై అండ్‌ డై, బందాని... ఇలా నచ్చిన డ్రస్‌ను ఎంచుకోండి.

మిడి స్కర్ట్‌: నేలంతా చిత్తడిగా ఉంటుంది కాబట్టి పొట్టిగా ఉండే మిడి స్కర్ట్‌లను ఎంచుకోవాలి. వీటిలో డెనిమ్‌ స్కర్ట్‌ ఎంచుకోవాలనుకుంటే, మోకాళ్ల పైకి ఉండే వాటిని ఎంచుకోవాలి.

షర్ట్‌ డ్రస్‌: కాలర్‌తో పాటు పై నుంచి కింది వరకూ బటన్స్‌ కలిగి ఉండే షర్ట్‌ డ్రస్‌ కూడా మాన్‌సూన్‌ ఫ్యాషనే! సౌకర్యంగా ఉండే ఈ డ్రస్‌ అటు ఈవినింగ్‌ గెట్‌ టు గెదర్స్‌కూ, ఇటు కాలేజీలకూ సూటవుతుంది.

Updated Date - 2023-07-12T00:46:21+05:30 IST