Messenger : ఎఫ్‌బీలోకి మళ్ళీ ‘మెసెంజర్’
ABN , First Publish Date - 2023-03-11T00:12:10+05:30 IST
ఫేస్‌బుక్‌లోకి మెసెంజర్ మళ్ళీ విలీనమవుతోంది. మొదట్లో ఈ రెండూ కలిసే ఉండేవి. 2014లో ఈ రెంటినీ విడదీశారు. ప్రస్తుతం
ఫేస్‌బుక్‌లోకి మెసెంజర్ మళ్ళీ విలీనమవుతోంది. మొదట్లో ఈ రెండూ కలిసే ఉండేవి. 2014లో ఈ రెంటినీ విడదీశారు. ప్రస్తుతం మళ్ళీ కలుపుతున్నట్టు మెటా బ్లాగ్ పోస్ట్ ‘ఫేస్‌బుక్ టుడే అండ్ టుమారో’లో వెల్లడించింది. గత ఏడాది జూన్‌లోనే ‘ద వెర్జ్’ ఈ విషయాన్ని వెల్లడించింది.
అలాగే సోషల్ మీడియా కన్సల్టెంట్ ఒకరు ఈ విషయాన్ని గత డిసెంబర్‌లో గుర్తించారు. టిక్‌టాక్‌తో పోటీపడాలన్న తలంపుతో ఈ మార్పు చేసినట్టు సమాచారం. ఈ మార్పుతో మెసెంజర్‌ను ప్రత్యేకంగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మొబైల్ బ్రౌజర్ వెర్షన్ కూడా తీసుకువస్తే మల్టిపుల్ యూజర్లకు వెసులుబాటు కల్పించినట్లవుతుందని భావిస్తున్నారు. ఫేస్‌బుక్ మరణించలేదని, మరణించబోవటం లేదని కూడా ఎఫ్‌బీ తన బ్లాగ్‌పోస్టులో పేర్కొంది. అంతేకాకుండా రెండు బిలియన్ల మంది డైలీ యాక్టివ్ యూజర్లు ఫేస్‌బుక్‌కు ఉన్నారని కూడా తెలిపింది.