Melatonin: మెలటోనిన్‌ లోపిస్తే...

ABN , First Publish Date - 2023-03-27T23:08:40+05:30 IST

మన పినియల్‌ గ్రంథి నుంచి ఉత్పత్తయ్యే మెలటోనిన్‌ లోపిస్తే, శరీర జీవగడియార క్రమం దెబ్బతింటుంది. కొద్దిపాటి పరిమాణాల్లో పేగుల్లో ఉత్పత్తయ్యే మెలటోనిన్‌కు మన రోగనిరోధకశక్తితో కూడా సంబంధం ఉంటుంది.

Melatonin: మెలటోనిన్‌ లోపిస్తే...

హార్మోన్‌ హెల్త్‌

మన పినియల్‌ గ్రంథి నుంచి ఉత్పత్తయ్యే మెలటోనిన్‌ లోపిస్తే, శరీర జీవగడియార క్రమం దెబ్బతింటుంది. కొద్దిపాటి పరిమాణాల్లో పేగుల్లో ఉత్పత్తయ్యే మెలటోనిన్‌కు మన రోగనిరోధకశక్తితో కూడా సంబంధం ఉంటుంది. పేగుల్లో కీలకమైన పాత్రను పోషించే ఈ హార్మోన్‌ మెదడుతో అనుసంధానమై ఉంటుంది. బరువును, ఆకలిని అదుపులో ఉంచే హార్మోన్ల పనితీరుకు మెలటోనిన్‌ దోహదపడుతుంది. రాత్రివేళ తగ్గే మెలటోనిన్‌ పరిమాణం వల్ల రక్తంలోని ఇన్సులిన్‌ స్థాయిలు పరిమితిలో ఉంటాయి. పర్యావరణం మూలంగా తలెత్తే ఇన్‌ఫ్లమేషన్‌ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. మెలటోనిన్‌ హార్మోన్‌ పేగుల్లోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, జీవన నాణ్యతను పెంచుతుంది. జీవక్రియల మీద ఇన్ని ప్రభావాలను కలిగి ఉండే మెలటోనిన్‌ హార్మోన్‌ సరిపడా ఉత్పత్తి కోసం అందుకు తోడ్పడే అలవాట్లను అలవరుచుకోవాలి. అందుకోసం...

ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగాలి.

జీడిపప్పు, బాదంలలో మెలటోనిన్‌ ఉంటుంది. అయితే పిస్తాలో దీని పరిమాణం ఎక్కువ.

కొవ్వుతో కూడిన చేపల్లో కూడా మెలటోనిన్‌ సమృద్ధిగా ఉంటుంది.

ఓట్స్‌, పుట్టగొడుగుల్లో కూడా మెలటోనిన్‌ ఎక్కువే!

Updated Date - 2023-03-27T23:08:40+05:30 IST